
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
కొరికిశాల గ్రామంలో ఉచిత వైద్య శిబిరం.
మండల వైద్యాధికారి ణి డాక్టర్ నాగ రాణి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ళపల్లి మండలం కొరికి శాల గ్రామం లో మరియు మోడల్ స్కూల్ కస్తూర్బా హాస్టల్లో మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో గ్రామంలో 56 మందికి, మోడల్ స్కూల్లో 105, మందికి కస్తూర్బా హాస్టల్లో 94 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇచ్చి పిల్లలకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగినది. ప్రతిరోజు స్నానం చేయాలని ,ఉతికిన బట్టలు వేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ నాగరాణి తెలియజేస్తున్నారు . అదేవిధంగా రెండు హాస్టల్లో భోజనశాలలను తనిఖీ చేసి వారికి తగిన సూచనలు ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాకేష్, కస్తూర్బా ప్రిన్సిపల్ శైలజ ,మరియు హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం శ్రీలత, నాగరాణి మరియు గ్రామ ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.