మొక్కలను నాటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి
ఆరోగ్యమే మహాభాగ్యం….
ప్రధానోపాధ్యాయులు రచ్చ కిష్టయ్య
చేర్యాల నేటిధాత్రి…
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట గ్రామాల్లో స్వచ్ఛదనం… పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పోతిరెడ్డిపల్లి గ్రామంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అనంతరం గ్రామస్తులకు ప్రధానోపాధ్యాయులు రచ్చ కిష్టయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రచ్చ కిష్టయ్య ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ…. మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మొక్కలను నాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలను నాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత, ఉపాధ్యాయులు, గ్రామపంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.