రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో,కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం
మంచిర్యాల నీటి ధాత్రి
మందమర్రి పట్టణ మొదటి జోన్ కి చెందిన జీదుల రాయమల్లు గురువారం రోజున మరణించడం జరిగినది వారి కుటుంబ సభ్యులు మరియు వారి కుమారుడు అయిన జీదుల దామోదర్ గారు నిర్ణయం మేరకు వారి తండ్రి గారి కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారు .
జీదుల దామోదర్ గారి మిత్రుడైన సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి తన తండ్రి గారి మరణించిన వార్త తెలుపగా మా యొక్క తండ్రి గారి కళ్ళను దానం చేయాలని అనుకుంటున్నానని శ్రీనివాస్ గారికి తెలిపినారు.
తను వెంటనే మంచిర్యాల జిల్లా రహీం బ్లడ్ ఆర్గనైజర్ అధ్యక్షులు అబ్దుల్ రహీం, జీదుల రాయమల్లు వారి నేత్ర దానం గురించి వివరాలు చెప్పడం జరిగినది.
రహీం బ్లడ్ ఆర్గనైజర్
అబ్దుల్ రహీం కి సమాచారం తెలిపిన వెంటనే
ఎల్ వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్, హైదరాబాద్. ఐ బ్యాంకు ఇంచార్జ్ డాక్టర్ కిషన్ రెడ్డి గారికి ఇట్టి విషయాన్ని తెలుపగా వారి వెంటనే స్పందించి.
మంచిర్యాల జిల్లా కి అందుబాటులో ఉన్న యం. జి. యం హాస్పిటల్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ డాక్టర్ ప్రదీప్, వారిని మందమర్రి పట్టణానికి పంపించడం జరిగింది..
మంచిర్యాల జిల్లా రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ మరియు సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బీమ్ పుత్ర శ్రీనివాస్ వారి సమక్షoలో .
తేదీ 13-03-2025 వ రోజు రాత్రి 11 గంటల సమయంలో జీదుల రాయమల్లు వారి రెండు కళ్ళను డాక్టర్ ప్రదీప్ గారి సహాయంతో ఆ రెండు కళ్ళను సేకరించి,
ఎల్ వి ప్రసాద్ ఇంటర్నేషనల్ ఐ బ్యాంక్, హైదరాబాద్ వారికి అందజేయడం జరిగినది.
తదుపరి సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ జీదుల రాయమల్లు బ్రతికున్న రోజుల్లో నేత్రదానం చేయాలని వారి కుటుంబ సభ్యులకు చెప్తూ ఉండేవారు.. తను తీసుకొన్న నిర్ణయమే ఈరోజు రెండు కళ్ళను దానం చేయడం జరిగినది.. మరియు మట్టిలో కలిసే అవయావాలు దానం చేయడం ద్వారా ఎందరికో ప్రాణ బీక్ష పెట్టవచ్చని అన్నారు. మరియు ప్రతి ఒక్కరూ మరియు యువత నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు.
మరియు జీదుల రాయమల్లు వారు నేత్రదానం చేసి ఇద్దరి అంధులకు కంటి చూపు కల్పించి, తన కర్తవ్యాన్ని నెరవేర్చిన తన కుమారుడు అయిన జీదుల దామోదర్ వారిని బంధుమిత్రులు, సోపతి వెల్ఫే సొసైటీ శ్రీనివాస్ మరియు రహీం బ్లడ్ ఆర్గనైజర్ రహీం అభినందించినారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, విష్ణువర్ధన్, భూపతి రెడ్డి, శంకర్, శ్రీనివాస చారి, సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బీమ్ పుత్ర శ్రీనివాస్ మరియు రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ రహీమ్, మందమర్రి పట్టణ అవయవ దాన సంఘ సభ్యులు బాబ్లీ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, పాల్గొనడం జరిగినది..