
కే డి సి బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు ప్యాడ్స్ పంపినం
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
మండలంలోని వర్ష కొండ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు నోటు పుస్తకాలు పంపిణీ
చేసారు ఇబ్రహీంపట్నం బ్రాంచ్ వారు కేడీసీ బ్యాంకు ల చైర్మన్ శ్రీ రవీందర్రావు గారి జన్మదిన సందర్భంగా ఫైనాన్షియల్ లిటరసీ అనే కార్యక్రమం 9 ,10 వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు పెన్నులు నోటు పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు అందరికీ పొదుపు చిన్ననాటి నుండి అలవాటు కావాలని అందుకోసం వారి బ్యాంకులో జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ లో ఇస్తామని తెలిపారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి మా పాఠశాలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ జి మారుతి , అసోసియేషన్ సభ్యులు రాము. ఉపాధ్యాయులు శ్రీనివాస్. ఇమ్మానియేల్. మహేష్. ఉపాధ్యాయుని శ్రీమతి మమత. అనిత. మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.