– మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్
కేశముద్రం (మహబూబాబాద్), నేటిధాత్రి:
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని వర్గాల వారినీ ఆదుకుంటున్నాయని
మహబూబాబాద్ శాసన సభ్యులు
బానోత్ శంకర్ నాయక్ అన్నారు.మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు 4,71,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.అనంతరం కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు రాజీనామా చేసి 30 మంది ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.స్వయంగా వారికి శంకర్ నాయక్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ఆదరణ కల్పిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం పై నమ్మకం ఉంచి వివిధ పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో గద్దె రవి, కేసముద్రమ్ జెడ్ పి టి సి రావుల శ్రీనాథ్ రెడ్డి,మార్కెట్ చైర్ పర్సన్ నీలం సుహాసిని దుర్గేష్,మాథారపు సత్య నారాయణ, కమటం శ్రీను,వీరు నాయక్,మండల & గ్రామ భారాస పార్టీ నాయకులు మరియు తదితరులు ఉన్నారు.