ఉప్పల్ లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 17

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు 70 వ జన్మదినం సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్ ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో పండ్లు, స్వీట్లు పంపిణీ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
అనంతరం ఉద్దేశించి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి
మాట్లాడుతూ


ఉద్యమ కాలమైనా, పరిపాలనా ప్రస్థానమైనా..
నిత్యం తెలంగాణనే శ్వాసించిన నాయకుడు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గద్దెనే ఎదిరించి, ఆత్మగౌరవ పతాక ఎగరేసిన నాయకుడు,
హక్కులు, వాటాలకు అన్యాయం జరిగితే పోరుగళమై గర్జించే
తెలంగాణ బాపు కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో
ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మహిళా నాయకురాలు, ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!