జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 70వ పుట్టినరోజు సందర్భంగా మండలంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయకత్వంలో జైపూర్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు జై బాల్క సుమన్, జై కెసిఆర్ అంటూ నినాదాలు చేస్తూ కెసిఆర్ పుట్టినరోజును మండల నాయకులు ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం కేసీఆర్ ఎన్నో విధాలుగా కష్టపడి అమర నిరాహార దీక్ష చేపట్టి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం సాధించి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి రైతే రాజు లాగా ఉండే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాడని అన్నారు. అలాంటి వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బలుమూరి అరవిందరావు, జెడ్పిటిసి మేడి సునీత-తిరుపతి, జిల్లా నాయకులు రిక్కుల మధుకర్ రెడ్డి, ఎంపీటీసీ లు, సర్పంచులు, వార్డ్ మెంబర్స్, సోషల్ మీడియా వారియర్స్, తదితరులు పాల్గొన్నారు.