https://epaper.netidhatri.com/
ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి!
తెలంగాణ కు నీరే ఆధారం..ఆ నీరు లేక దశాబ్దాల పాటు విలవిల లాడిన జనం గొంతు తెడపడమే, కాదు ఎండిన నేలమ్మ దాహం తీర్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసిఆర్. అంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే
`మిషన్ కాకతీయ ఒక విప్లవం.
`ఊరి చెరువులు గ్రామీణ ఆర్థిక వనరులు.
`కుల వృత్తులకు కల్పతరువులు
`సకల సంపదలకు నిలయాలు.
`చెరువులకు పూర్వ వైభవం తెలంగాణకు కల్పవృక్షం.
`చెరువును అక్షయపాత్ర చేసిన దేవుడు కేసిఆర్.
`తెలంగాణ ను అన్నపూర్ణ గా మార్చిండు
`ఎడారిని ఒయాసిస్సులా మార్చి బంగారం పండేలా చేసిండు.
`సాగును సుసంపన్నం చేసి దేశానికే అన్నం పెడుతున్నాడు.
హైదరబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ఊరు పాలవెల్లిలా మారిపోయింది. కాదు మార్చబడిరది. అసాధ్యమనుకున్న పనులను సుసాధ్యం చేయడమే, అనితరసాద్యమైన విజయాలు సాధించడం ఒక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసిర్‌కే సాధ్యం. అసలు తెలంగాణ విషయంలో సాగు నీటి రంగం ఇంతలా పురోభివృద్ధి జరుగుతుందని కలలో కూడా ఎవరూ ఊహించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అసలు తెలంగాణకు నీళ్లు ఇవ్వడం అన్నది సాధ్యం కాదని తేల్చేశారు. నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ప్రజల్ని నమ్మించారు. నయ వంచన చేశారు. కాకపోతే ఎత్తి పోతలతో కూడా మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేయొచ్చని గత పాలకులు కూడా ఊహించలేదు. కాని ఎడారి మారిన తెలంగాణను ఒయాసిస్సుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రిది. కేసిఆర్ కలల నుంచి, ఆలోచనలనుంచి, ఆశయాల నుంచి, సంకల్పం నుంచి ఎవరూ ఊహించని తెలంగాణ పల్లె ఆవిష్కరింపబడిరది. పల్లె పునరుజ్జీవం పొందింది. పల్లె మళ్లీ కొత్త సొగబులు అద్దుకున్నది. చెదిరిన కలతో , చేదు జ్ఞాపకాలు, పీడ కలలు తప్ప, పండగ మర్చిపోయిన తెలంగాణ నిత్య వసంతరం పచ్చ తోరణంలాగా వెలిగిపోతోంది. కన్నీటిని దిగమింగుకుంటూ, దినదినగండంగా సాగిన తెలంగాణ పల్లె నిత్యపండుగ శోభను సంతరించుకొని కళకళలాడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో కొత్త అందాలు సంతరించుకున్నది. ఎండిన మోడులాంటి తెలంగాణ, పండుటాకులా వాడిపోయిన తెలంగాణ కేసిఆర్ పాలనలో పచ్చని మాగాణమైంది. ఊరంతా పచ్చ పైటను సింగారించుకున్నది. చెట్టు, చేమకూడా లేకుండా, నీడకు కూడా ఏడ్చిన తెలంగాణ ఇప్పుడు పచ్చని వనం అల్లుకున్నది. పచ్చని అడవి పల్లెకు నీడనిస్తోంది. చెరువుల పండుగతో తెలంగాణ పల్లె మురిసిపోతోందంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుకు చెప్పిన విషయాలు..ఆయన మాటల్లో..
సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఎటుచూసినా ఎండిపోయిన చెరువలు.
పూడిపోయిన బావులు. ఆనవాలు లేకుండా పోయిన భూగర్భ జలాలు. పూడికలు పూడిపోయి, ఊటలకు దిక్కులేక, చెత్తాచెదారం నిండి మోటబావులు. ఎంత తోడిరచినా చుక్క నీరు కాన రాని రోజులు. చేదబావుల్లో సైతం చుక్కజాడలేక ఆడబిడ్డల కన్నీటి చుక్కలు రాలిన కష్టాలు. కనీసం చెరువు అన్నది కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పల్లెలు. తుమ్ములు మొలిచి తూముల జాడ కరువైన పరిస్ధితులు. ఆక్రమణలకు కూడా గురైన చెరువుశిఖాలు. ఒకప్పుడు నిండు కుండల్లా, గంగాళాల్లా ఎప్పుడూ నీళ్లతో కళకళలాడే పల్లెలు, చెరువులు ఒట్టిపోయాయి. పరాయి పాలకుల నిర్లక్ష్యంతో చెంబెడు మంచినీళ్లు దొరకని కడగండ్లు. తెలంగాణ రాకముందు రోజు వరకు వున్న దుస్దితి. కాని తెలంగాణ వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ పల్లెలకు మళ్లీ ప్రాణమెచ్చింది. తెలంగాణ చిగురించడం మొదలుపెట్టింది. పచ్చని పైట కప్పుకునేందుకు తెలంగాణ నేలమ్మ సింగారించుకున్నది. తెలంగాణ వచ్చిన ఏడాదిలోనే తెలంగాణలోని చెరువులకు జలకళ వచ్చింది. అపరభగీరధుడు కేసిఆర్ తలుచుకున్నాడు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టించారు. భువినుంచి గంగాదేవి దిగివచ్చి పరుగుపరుగున చెరువుల నిండినట్లే, గోదారి మళ్లించి తెలంగాణ చెరువులు గంగాలం చేశారు. చుక్కనీరు లేక దశాబ్ధాల పాటు మోడులా మారిన చెరువుల్లో మళ్లీ నీటిసుడులు చూస్తున్నాం. చిన్న చిన్న అలలు చూసి మురుస్తున్నాం. ఆ పిల్ల తెంపరలు తెలంగాణ పల్లెలకు అందాలు అద్దాయి. నీటి సవ్వడులు ఎండా కాలంలో సయ్యాటలాడాయి. వాన చుక్క కానరాని వేసవిలో తెలంగాణ చెరువులు మత్తుళ్లు దుంకాయి. ఇది కలా! నిజామా!!అని రైతు ఆశ్యర్యడ్డాడు. మురిసిపోయాడు. ఆ నీటిలో జలకాలాడాడు. కళ్లకు అద్దుకున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను, మంత్రి హరీష్‌రావును రైతు దీవించాడు. ఈ తరం యువత చెరువులు చూడలేదన్న బాధను మరిపించారు. భవిష్యత్తు తరాలలో పల్లెల్లో నీటి కటకట రాకుండా చేశారు. మూడేళ్లపాటు చెరువుల పండగ నిర్వహించారు. తెలంగాణలోని 46 వేల చెరువుల్లో పూడికలు తీశారు. చెరువులన్నీంటిలో గోదారి జిలాలో నింపి, పూజలు చేశారు. నేలమ్మ దీవెనలు, గంగమ్మ వరాలు తెలంగాణ పల్లెలకు అందించారు. కొన్ని దశాబ్దాలుగా చుక్క నీరు చూడని రైతన్న సంబరపడ్డాడు. యువతలో కొత్త ఆశలు చిగురించాయి. సంబరాలు చేసుకున్నారు. తొండలు కూడా గుడ్లుపెట్టని ప్రాంతాలంటూ హేళన చేసిన వారు పచ్చని తెలంగాణ పల్లెలు చూసి ఈర్శ్యపడుతున్నారు. తెలంగాణ పల్లెలకు గోదారి పరవళ్లు రావడంతో, ఏనాడో గతి తప్పిన వాగులు మళ్లీ పరుగులందుకున్నాయి. వంకలన్నీ పాత దారులను వెతుక్కొని కొత్త పరుగులందుకున్నాయి. ఒర్రెలు కూడా నీటిని నింపుకుంటూ, జల ఊటలకు దారులు చూపాయి. తెలంగాణ చెరువులన్నీ పండుగ చేసుకున్నాయి. తెలంగాణలో చెరువుల పండగొచ్చింది. సాగు సల్లగుండాలే..రైతు సంతోషంగా వుండాలి. ఆనందంగా వుండాలి. సుభిక్షంగా వుండాలి. పెదవులుపై చిరునవ్వులు తొనికిసలాడాలి. కాలం కావాలని మొగులు వైపు, కరువు రావొద్దని కాలం వైపు, పంటలెండిపోవద్దని దిగులు పడాల్సిన అవసరంలేదు. సాగు నీటి కటకట లేదు. పల్లె పచ్చగుండాలి. పాడి పంటలతో కళకళలాడాలి. చేనంతా పచ్చని పైట కప్పుకోవాలి. రైతులకు బంగారు సిరులు పండాలి. వృత్తులు పునరుజ్జీవం కావాలి. మావన వనరుల అభివృద్ధికి మళ్లీ జీవం పోయాలి. ప్రభుత్వాలు భరోసా కావాలి. రైతును ఆదుకునే పాలకులు కావాలి. రైతును అడుగడుగనా అండగా నిలిచే కేసిఆర్ పాలనే ఎల్లకాలం వుండాలి. రైతు పెట్టుబడి కష్టం రాకుండా చూసుకుంటున్న ఏకైక ప్రభుత్వం. తెలంగాణలో అమలౌతున్న రైతు బంధు దేశమంతా అమలు కావాలి. రైతు ఒకరి సాయం కోసం అర్దించే పరిస్ధితి రావొద్దు. అప్పుల పాలు కావొద్దు. ఈ సాగు మా వల్ల కాదని వ్యవసాయం వదిలేయొద్దు. రైతు ఏడ్చే రోజు అసలే రావొద్దు. ఇదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యం.
ఇది తెలంగాణలో నెరవేరిన స్వప్నం. అంటే నిజమైన కల.
ఆ కల దేశమంతా కలగా మిగిలిపోకూడదు. తెలంగాణలో రైతు ఎంత సుభిక్షంగా వున్నాడో దేశమంతా అలాగే రైతు ఆనందంగా వుండాలి. గతంలో అంతో ఇంతో రైతు సంక్షేమం మీద కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించేవి. కాని కేంద్రంలో బిజేపి వచ్చిన తర్వాత రైతు గోసలు మరింత పెరిగాయి. ఈ ఏడెనెమిదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కట్టిన పాపాన పోలేదు. తెలంగాణలో కాలం అబ్బురపడేలా, ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా మూడేళ్లలో కాలేశ్వరం…ఆరేళ్లలో మల్లన్న సాగర్ తోపాటు, అనేక రిజర్వాయర్లు పూర్తి చేసుకున్నాము. తెలంగాణలో నీటి గోస లేకుండా చేసుకున్నాము. తెలంగాణ సాధించుకున్న నాడు ఒట్టిపోయిన చెరువులు, ఎండిపోయి చుక్కలేని చెరువులు, తుమ్మ చెట్లు నిండిపోయిన చెరువులు. ఆక్రమణలకు గురై ఆనవాళ్లులేని చెరువులు. మొత్తంగా తెలంగాణ పల్లెలకు నీరు దిక్కులేని రోజులు చూసిన కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ ఏ కాలంలోనూ ఎండిపోని బావులు చూస్తున్నది. బోర్లన్నీ ఇరవై నాలుగు గంటలు నీరందిస్తున్నాయి. ఇదంతా తెలంగాణ చేసుకున్న పుణ్యం. మంత్రి హరీష్‌రావు లాంటి నాయకుడి కష్టం. తెలంగాణ ప్రజలు, రైతులు అనుభవిస్తున్న ఆనందం. నీరే మనిషికి ఆధారం. ఆ నీరు సమృద్దిగా వుంటేనే మనిషి మనుగడుకు సాగును వ్యవసాయం. కల చెదిరిన పల్లెలకు, ఊళ్లనొదిలి కడుపు చేత పట్టుకొని వలసలు వెళ్లి, బతకపోయిన రైతులంగా తెలంగాణలోనే మన బతుకు బంగారమని మళ్లీ వచ్చిన సంబురం. ఇదే కదా సర్గసీమకు నిదర్శనం. సాదించుకున్న తెలంగాణ అందుకున్న సాగువిప్లవం…విజయం…సంతోషం…సాగు సంపదకు తెలంగాణ నిలయం.