‘‘మహానాయకుడు’’, ‘‘విశ్వనాయకుడు’’ మన ‘‘కేసిఆర్‌’’

`కేసీఆర్‌ జై తెలంగాణ అన్ననాడు కలిసొచ్చిన వారు లేరు

`కేసీఆర్‌ తెలంగాణ తెస్తున్నాడని తెలిసిన తర్వాత జై తెలంగాణ అనని వారు లేరు

`సమైక్య వాదుల చేత కూడా జై తెలంగాణ అనిపించిన వీరుడు

`తన రాజకీయ భవిష్యత్తు ఫణంగా పెట్టి తెలంగాణ జెండా ఎత్తుకున్నాడు

‘‘చీకటిలో చిరుదివ్వె కాదు’’…’’వెలుగు రవ్వ’’! ‘‘కేసిఆర్‌’’..అంటూ తెలంగాణ కోసం కేసిఆర్‌ అడుగులు వేసిన నాటి కాలం, కేసిఆర్‌ పాలనలో తెలంగాణ ప్రగతి మార్గం గురించి ‘‘బిఆర్‌ఎస్‌’’ సీనియర్‌ నాయకుడు, జనగామ శాసన సభ్యుడు ‘‘పల్లా రాజేశ్వర్‌ రెడ్డి’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న విషయాలు.. ఆయన మాటల్లోనే..

`తెలంగాణకు వేకువ తెచ్చిన సూరీడు

`తెలంగాణకు వెలుగులు పంచిన పాలకుడు

`పదేళ్లలో సంక్షేమాన్ని ,ప్రగతిని సమ పాళ్లలో బంగారు తెలంగాణ ఆవిష్కరించారు

`నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన దిగ్గజ నాయకుడు

`కేసీఆర్‌ కు సాటి దేశంలోనే మరో నాయకుడు లేడు

`రాష్ట్రం కోసం రాజకీయ పార్టీ పెట్టిన చాణక్యుడు

`తెలంగాణ ప్రజల అరవై ఏళ్ల కలను నిజం చేసిన పోరాట యోధుడు

`తెలంగాణ ప్రజల కన్నీటిని తుడిచిన సేవాతత్పరుడు

`ప్రజల కోసం తెలంగాణ నినాదమై సమైక్య పాలకులను గడగడలాడిరచారు

`తెలంగాణ సెగ డిల్లీకి తాకేలా చేసి తెలంగాణ ఇచ్చేలా చేశాడు

`తెలంగాణ ప్రజల తెగువను పోరాటంగా మలిచిన మలిదశ ఉద్యమ కారుడు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కేసిఆర్‌ మహానాయకుడు. విశ్వనాయకుడు. ప్రపంచ ఉద్యమాలకే మార్గం చూపిన గొప్ప నాయకుడు. బిఆర్‌ఎస్‌ అదినేత కేసిఆర్‌ సాగించిన ఉద్యమం సామాన్యమైంది కాదు. అందరివల్ల అయ్యేది కాదు. తెలంగాణ సాధన ఉద్యమమనేది ఎంత భారమో కేసిఆర్‌కు తెలుసు. ఎంత కష్టమో గత ఉద్యమాలు చూసిన అనుభవం కూడా కేసిఆర్‌కు వుంది. అయినా తెలంగాణ సాధించడమే తన జీవిత లక్ష్యం చేసుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ తెలంగాణ సాధించముందు..తెలంగాణ రాకముందు నా నియోజకవర్గం జనగామ కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌గా వుండేది. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఏటా కరువు ప్రాంతాలను ప్రకటిస్తూ వుండేవి. అలా నిత్య కరువు ప్రాంతంగా జనగామ మారిపోయింది. కేంద్రం నుంచి జనగామ ప్రాంత కరువు నివారణ కోసం కేంద్రం నిధులు కేటాయించినా ఒక్క రూపాయి కూడా జనగామకు ఖర్చుపెట్టకుండా సమైక్యపాలకులు తీవ్ర అన్యాయంచేశారు. అప్పటి కాంగ్రెస్‌ నాయకులు కనీసం ప్రశ్నించేవారు కాదు. జనగామకు న్యాయం చేయాలన్న సోయిలో ఎప్పుడూ లేరు. ఆ సమయంలో జనగామ, బచ్చన్నపేట, చేర్యాల, మద్దూరు మండలాలు కరువుతో విలవిలాడేవి. అయినా అప్పటి పాలకుల మనసు కరిగింది లేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో బచ్చన్నపేటలో కరువును చూసి కేసిఆర్‌ చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే ముందు జనగామ నియోజకవర్గ కరువును రూపుమాపుతానని మాటిచ్చారు. అన్నట్లుగానే తెలంగాణ వచ్చిన తర్వాత ముందు కరువును జనగామ నుంచి తరమికొట్టిన నాయకుడు కేసిఆర్‌. మిషన్‌ కాకతీయ పనుల తొలి దశలోనే జనగామకు ప్రాదాన్యత కల్పించి, మొత్తం చెరువులను ఏకకాలంలో బాగు చేయించారు. జనగామ నియోజకవర్గ పరిధిలోని అన్ని చెరువుల పూడిక పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టారు. చెరువులన్నీంటికీ కొత్త మరింత పటిష్టమైన కట్టలను ఏర్పాటు చేశారు. చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. పదేళ్లపాటు ఏ ఒక్క చెరువులో చుక్క నీరు తగ్గకుండా ఎప్పటికిప్పుడు నింపుతూ, మండుటెండల్లో కూడా మత్తళ్లు దుంకేలా నీటితో కళకళలాడేలా చేశారు. సముద్ర మట్టానికి తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం జనగామ నియోజకవర్గం. అలాంటి నియోకవర్గంలో భూగర్భజలాలు అడుగంటి, వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరు వచ్చేది కాదు. బావులన్నీ ఎండిపోయి, ఎడారిగా మారిపోయింది. అలాంటి జనగామలో పాత బావులన్నీ పదేళ్లపాటు ఎల్లబోశాయి. బోర్లలో నిరంతరం నీరుండేది. కాంగ్రెస్‌ వచ్చింది. మళ్లీ కరవు తెచ్చింది. పదేళ్లపాటు ఎండిపోని బావులు ఎండిపోయాయి. పదేళ్ల కాలం చుక్క నీరు ఇంకనంత నిండుగా వున్న చెరువులన్నీ మళ్లీ ఎండిపోయాయి. చెరువులను నింపాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్‌కు లేకుండాపోయింది. అందుకే ప్రజలు మళ్లీ సారే రావాలంటున్నారు. కారే కావాలని కోరుతున్నారు. తెలంగాణ కళకళలాడాలంటే కేసిఆర్‌ నాయకత్వంలోనే పాలన సాగాలని బలంగా కోరుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ రజతోత్సవసభకు లక్షలాదిగా ప్రజలు తరలి వచ్చి, బిఆర్‌ఎస్‌ మద్దతు పలికేందుకు సిద్దంగా వున్నారు. అరవై ఏళ్ల గోసను ఆరేళ్లలో తీర్చి, తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన కేసిఆర్‌ తెలంగాణ చీకట్లను పారద్రోలారు. వెలుగులు పంచారంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కలిసి పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు ఆయన మాటల్లోనే…

అలుపెరగని యోధుడుగా పద్నాలుగేళ్లపాటు నిరంతర పోరాటం సాగించి తెచ్చిన తెలంగాణను బంగారు మయం చేశారు. పన్నెండేళ్ల క్రితం తెలంగాణ ఎలా వుండేది. ఏడాదిన్న క్రితం వరకు ఎలా వున్నది. మళ్లీ కాంగ్రెస్‌ రాగానే తెలంగాణ పరిస్ధితి మళ్లీ ఎందుకు వెనక్కి వెళ్లింది. ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. ఒక్క ఏడాదిలోనే తెలంగాణ ఎందుకు ఇలా ఆగమైంది. తెలంగాణ మీద మమకారం లేని పాలకులు పాలిస్తే ఇలాగే వుంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి అధికారంలోకి రావడమే పరమావది. కాని కేసిఆర్‌కు తెలంగాణను బంగారు మయం చేయడమే లక్ష్యం. అందుకే కేసిఆర్‌ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో కళకళలాడిరది. కాంగ్రెస్‌ చేతిలో ప్రజలు అధికారం పెట్టగానే ఆగమైపోయింది. ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. సాగను నీరివ్వడం కాంగ్రెస్‌ బందు పెట్టింది. తెలంగాణ రైతుకు పదేళ్లు పండుగ చేసి కేసిఆర్‌ రైతును రాజు చేశారు. కాంగ్రెస్‌ వచ్చి రైతును మళ్లీ బికారిని చేస్తున్నారు. వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేశారు. ఒక్కసారి 25 ఏళ్ల వెనక్కి వెళ్తే.. తెలంగాణ మాగాణ అంతా ఎక్కడ చూసినా బీళ్లే…తెలంగాణ బతుకంతా ఎడారే..ఎటు చూసినా చుక్కనీరు కనిపించేది కాదు. పొలాలు కనిపించేవి కాదు. పల్లెర్లు మెలిచిన భూములే తప్ప, పంటలు కనిపించే జాడలే వుండేవి కాదు. అప్పటి పరిస్దితులు ఈ తరానికి పెద్దగా తెలియవు. ఎందుకంటే కేసిఆర్‌ ఈ పదేళ్లకాలంలో కరువు అంటే ఎలా వుంటుందో కలలో కూడా తెలంగాణ ప్రజలకు కనిపించకుండా చేశారు. గతంలో పడిన అవస్దలు మళ్లీ తెలంగాణ ప్రజలకు రాకూడదని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. కటిక పేద ప్రాంతం నుంచి తెలంగాణను సంపన్న రాష్ట్రంగా మార్చారు. కేసిఆర్‌ తెలంగాణ కోసం కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదికాదు. తెలంగాణ ఇలా బంగారుమయ్యేది కాదు. ఇప్పటికీ అదే కరువు పరిస్దితులల్లో తెలంగాణ కొట్టుమిట్టాడుతూ వుండేది. పద్నాలుగేళ్లపాటు కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ వల్లనే తెలంగాణ అభివృద్ది సాధ్యమౌతుందని బలంగా నమ్మారు. కేసిఆర్‌ చేసిన అభివృద్దిని చూసి మురిసిపోయారు. తమ జీవితాలను బంగారు మయంచేసుకున్నారు. కాని ఎలాగైనా,అడ్డుదారుల తొక్కైనా సరే, ప్రజలను మోసం చేసి పాలించాలని చూశారు. అదికారంలోకి రావాడానికి మోసపూరితమైన హమీలన్నీ గుప్పించి అదికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసినా, కనీసం అధికారంలోకి వచ్చిన తర్వాతైనా కేసిఆర్‌ పథకాలు సక్రమంగా అమలుచేసినా తెలంగాణకు మళ్లీ పాత రోజులు వచ్చేవి కాదు. తెలంగాణ కాంగ్రెస్‌నాయకులకు ప్రజలు పచ్చగా వుండడం వుండడం ఇష్టం లేదు. ప్రజలు సంతోషంగా వుండడం ఇష్టంలేదు. అందుకే కేసిఆర్‌ అమలు చేసిన పథకాలను అమలుచేయడం లేదు. రైతు బంధు పేరు మార్చి భరోసా అన్నారు..దానికి రాం రాంచెప్పారు. రైతుబంధు సొమ్ములు మాయం చేశారు. రైతులకు మొండి చేయిచూపించారు. రుణమాఫీ అని గప్పాలు కొట్టి రైతులను నమ్మించి, ఇప్పుడు రైతులనోట్లో మట్టికొట్టారు. రుణమాఫీ జరిగినట్లు ప్రచారం చేసుకుంటూ మళ్లీ మోసం చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణను మళ్లీ నాశనం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. తెలంగాణ ప్రజలను గోస పెడుతున్నది. గతంలో కాంగ్రెస్‌ హయాంలో చీకట్లతెలంగాణ. కేసిఆర్‌ పదేళ్లలో వెలుగుల తెలంగాణ. కాంగ్రెస్‌ హాయంలో ఆకలి తెలంగాణ. కేసిఆర్‌పాలనలో అన్నపూర్ణగా మారిన తెలంగాణ. ఇలా ఒకటి కారు రెండు కాదు..అన్ని రంగాలలో తెలంగాణ అన్నింటా ఫస్టు…బెస్టుగా మారపోయింది. కాని కాంగ్రెస్‌ వచ్చిన అన్నింటిలో తెలంగాణను అధపాతాలానికి తొక్కేస్తున్నారు. తెలంగాణ పరువును గంగలో కలిపేస్తున్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రజలకు గోసలు లేవు. ఏ అవస్ధలులేవు. కరువు లేదు. కాని కాంగ్రెస్‌ వచ్చి ఏడాదికే తెలంగాణ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. తెలంగాణను కరువులోకి నెట్టేస్తున్నారు. తెలంగాణను మళ్లీ వలసలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చుతున్నారు. నిన్నటి దాకా కేసిఆర్‌ సాధించిన విజయాలలో తెలంగాణ అంతా అధ్భుతమైన పాడి పంటలతో కళకళలాడుతూ కోటిన్నర ఎకరాల మాగాణమైంది. సారు నీటి పరవళ్లు కదం తొక్కాయి. బంగారు పంటల దిగుబడులు రైతులు కళ్లారా చూశారు. రైతు బంధుతో రైతు సాగు కష్టం తీరింది. అప్పుల బాద తప్పింది. ఏరువాక సమాయానికి రైతు చేతికి రైతుబంధు సొమ్ము అందింది. విత్తనాలకు, పొలం పనులకు అవసరమైన సొమ్ము రైతు చేతి నిండేందుకు రైతు బంధు ఉపయోగపడిరది. పెట్టుబడి సాయం అన్నది రైతులకు ఎంతో మేలు చేసింది. ఇరవై నాలుగు గంటల కరంటుతో రైతుకు తిప్పలు తిప్పంది. రాత్రి వేళల్లో గోస తప్పింది. అన్ని రంగాలలో తెలంగాణ పరుగులు పెట్టింది. కాంగ్రెస్‌ వచ్చి అంతా ఆగం చేసింది. తెలంగాణను మళ్లీ ఎడారి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!