కారే రావాలి. సారే కావాలి!

https://epaper.netidhatri.com/

`సామాన్యల మదిలో ఇదే మాట.

`ప్రతిపక్షాలు ఎంత మభ్యపెట్టినా జనం చెబుతున్నది అదే మాట.

`పల్లె, పట్నం ఒకటే మాట.

`కేసిఆర్‌ తో తెలంగాణ అంతా..

` కేసిఆర్‌ వెంటే జనమంట.

`అభివృద్ధి ప్రధాతతోనే ప్రయాణమంట.

`గోస పెట్డిన కాంగ్రెస్‌ మాకొద్దంట.

`మాట తప్పడం కాంగ్రెస్‌ కు అలవాటేనంట.

`అరవై ఏండ్ల గోస పోగొట్డిన కేసిఆరే మాకు అండ.

`తెలంగాణ మరిన్ని వెలుగులు చూడాలంటే కేసిఆరే రావాలంట.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్న ఏకైక మాట. తెలంగాణలోని ఏ ప్రాంత ప్రజలను కదిలించినా చెబుతున్న మాట ఇదే. ఎందుకంటే పదేళ్ల క్రితం తెలంగాణ. ఇప్పుడున్న తెలంగాణను ప్రజలు చూస్తున్నారు. నాటి గోసలు గుర్తు చేసుకుంటున్నారు. అరవై ఏళ్లు తెలంగాణ ప్రజలు గోస పడుతుంటే అయ్యో..అని బాధ పడిన నాయకుడు ఒక్కరైనా ఆనాడు కాంగ్రెస్‌లో వున్నాడా? ఆ సమయంలో ఒక వేళ ఎవరైనా జై తెలంగాణ అన్నా అది వారి రాజకీయ స్వార్ధం కోసమే అని అనేక సందర్భాలలో తేలిపోయింది. 1669లో విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమం చేస్తే అందులో దూరిన కాంగ్రెస్‌ రాజకీయ నాయకులు ఏం చేశారు. విద్యార్ధి ఉద్యమాలను హైజాక్‌ చేసి, చెన్నారెడ్డి లాంటి వారు ఉద్యమాన్ని వారి గుప్పిట్లోకి తీసుకొని, తెలంగాణ ప్రజా సమితి పేరు మీద గెలిచి, కాంగ్రెస్‌లో కలిపేశారు. తెలంగాణ ఉద్యమాన్ని చిదిమేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం మీద దెబ్బకొట్టారు. కాంగ్రెస్‌ నాయకులు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని పదవులు పొందారు. నాయకులుగా చెలామణి అయ్యారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌ అయ్యాడు. కేంద్ర మంత్రి పదవులు వెలగబెట్టారు. ఆయన బాటలోనే చాలా మంది నడిచారు. ఆస్ధులు కూడబెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలను వంచించారు. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఉపయోగపడ్డారు… రాజశేఖరరెడ్డి రాజకీయ అవకాశాలకు నిచ్చెనలేశారు. అడుగడుగునా తెలంగాణను అవమానాలకు గురి చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర నేతలు దెబ్బతీస్తుంటే గుడ్లప్పగించి చూశారు. ఇది మన కళ్లముందు వున్న జరిగిన చరిత్ర.
1994లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పదేళ్లు ప్రతిపక్షంలో వుంది.
2004లో కూడా అధికారంలోకి రాకపోతే ఇక కాంగ్రెస్‌ ఖతమే అన్నంతదాకా వెళ్లింది. దాంతో అధికార దాహంతో వున్న సీమాంధ్ర నాయకులు, తెలంగాణ నాయకుల చేత కృత్రిమంగా జై తెలంగాణ నినాదాలు వినిపించారు. నిజంగా కాంగ్రెస్‌ నాయకులకు చిత్త శుద్ది వుంటే… చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని వాడేందుకు ఊడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వణికిపోయారు. కాని కేసిఆర్‌ తెలంగాణ ఉద్యమ శంఖాన్ని పూరించాడు.. అసెంబ్లీలో తెలంగాణ అన్న పదం వినిపించకుండా చేసిన కట్టడిని కేసిఆర్‌ ఎదిరించాడు… ఎవరూ తెలంగాణ అన్న పదం వాడొద్దని చంద్రబాబు ఆనాడు సభలో తీర్మాణం చేయించాడు. కేసిఆర్‌ తిరగబడ్డాడు. నిలదీశాడు. తెలంగాణ ప్రజలు అంగీకరించని ప్రపంచానికి వినిపించాడు. నా ప్రాంతం అరి గోస పడుతుంటే, నా ప్రాంతాన్ని పేరు పెట్టి పిలవకుండా కట్టడి చేస్తానంటే నేను ఊరుకునే ప్రసక్తి లేదని దిక్కరించిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. ఆనాడు చంద్రబాబుకు భయపడి సభ సంప్రదాయాలకు కట్టుబడి వుండాలన్న సాకుకు చెప్పి, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా తెలంగాణ అన్న పదం వాడడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకుడు కూడా ఇదేం పద్దతి తెలంగాణకు అనూకూలంగా మట్లాడిరదిలేదు. ఆనాటి ప్రభుత్వాన్ని ఏ కాంగ్రెస్‌ నాయకుడు ప్రశ్నించలేదు. ఏ ఒక్క తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడు సభలో నిరసన తెలుపలేదు. కాని 2004 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే పరిస్దితి కనిపించడం లేదని తెలిసి జై తెలంగాణ అనండని రాజశేఖరెడ్డి చెబితే గాని గొంతు పెగలలేదు. కనీసం అప్పుడైనా అసెంబ్లీలో జై తెలంగాణ అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అన్నారా? అంటే అదీ లేదు. ముఖ్యమంత్రి కావాలనుకున్న రాజశేఖరెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు అండగా వుండడం కోసం బైట అన్నారే గాని, సభలో అనలేదు. తన రాజకీయ స్వార్ధం కోసం తెలంగాణ నాయకులను ఉసిగొల్పిన రాజశేఖరెడ్డి ఒక్కనాడైనా మా పార్టీ తెలంగాణకు అనుకూలం అని చెప్పాడా? అంటే అదీ లేదు. ప్రతిపక్ష నేతగా 1999 నుంచి 2004 దాకా వున్న వైఎస్‌. రాజశేఖరెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఏనాడైనా ప్రశ్నించాడా? అంటే లేదు. అలాంటి కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది మేమే…అంటూ అవేవో వేదాలు వల్లించినట్లు చెబుతున్నారు.
నిజాం రాజ్యంతో కొన్ని దశాబ్ధాల పాటు పోరాటం చేసి, విముక్తి చెందిన తెలంగాణ ఊపిరి తీసుకోకముందే, బాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రతో కలిపేశారు.
రెండు ప్రాంతాల నాయకులతో పెద్ద మనుషులు ఒప్పందం చేయించినట్లే చెయించి, డిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చేలోపే రాష్ట్రం పేరు మార్చిన ఘనత కాంగ్రెస్‌ నాయకులది. డిల్లీ పెద్దల దగ్గర తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ అన్న పేరును ప్రతిపాదించి, హైదరాబాద్‌లో దిగగానే ఆంధ్రప్రదేశ్‌ అని నామకరణం చేస్తే చేష్టలుడిగి, పదవుల కోసం ఆశపడిరది తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు. ఆనాటి నుంచి తెలంగాణను పీక్కు తినడానికి తప్ప తెలంగాణకు మేలు చేసిన కాంగ్రెస్‌ నాయకుడు లేడు. తెలంగాణను ఆంధ్రలో కలిపి కుంపటి పెట్టిందే కాంగ్రెస్‌ నాయకులు. ఆనాడు ఆంధ్రలో కలిపేయకపోతే తెలంగాణ ఆనాడు బాగుపడేది. ఆత్మగౌరవంతో అస్ధిత్వంతో బాగుపడేది. అరవై ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్సి వచ్చేదా? తెలంగాణ మిగులు మూడు కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తే, మా ఇంట్ల మాసిపోయి గోడకేసి వున్నాయి..తెచ్చియ్యమంటే తెచ్చిస్తాను అని తెలంగాణను అవమానించిన నాయకులు కాంగ్రెస్‌ నాయకులు కాదా? ఇప్పుడు తెలంగాణ మేమిచ్చామంటూ చిలకపలుకులు పలుకుతున్నారు. తెలంగాణలో 1969లో సమారు 375 మంది, తర్వాత 2004నుంచి 2014 దాకా 1200 మందికి పైగా యువత ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్‌ నాయకులు కారణం కాదా? వీటికి కాంగ్రెస్‌ నాయకుల దగ్గర సమాధానం లేదు. సీమాంధ్ర నాయకుల ముందు మాట్లాడడానికి ఇప్పటికీ నోట్ల నాలుక లేని, వారి ముందు కూర్చునేందుకు వెన్నెముక లేని నాయకులు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, ప్రజల ఆత్మగౌరవం నిలుపుతారా? హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన సీమాంధ్ర ప్రజల ఓట్ల కోసం ఆశపడుతూ, వారి ఆశీస్సులతో అధకారం కోరుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు మరోసారి ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలే కోరుకుంటున్నారు. కాని తెలంగాణ కోసం కాదన్నది ఇక్కడే స్పష్టమౌతోంది. అందుకే ఎక్కడికెళ్లినా తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ ఎందుకు కావాలో స్పష్టంగానే చెబుతున్నారు.
కారే రావాలి…మళ్లీ కేసిఆరే ముఖ్యమంత్రి కావాలి.
బిఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలోకి రావాలి. అని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఎంత మభ్య పెట్టాలని చూసినా, ప్రజలు నమ్మేందుకు సిద్దంగా లేరు. పల్లెనుంచి పట్నందాక ఒకటే మాట. ముఖ్యమంత్రి కేసిఆర్‌నే తమ ప్రయాణం అని ప్రజలే స్పష్టం చేస్తున్నారు. రెండు వేలు పించన్‌ ఇచ్చి మమ్మల్ని సాదుతున్న పెద్ద కొడుకు కేసిఆర్‌ అని తెలంగాణ సమాజం అంటోంది. కేసిఆర్‌తోనే తెలంగాణ వచ్చింది. అభివృద్ధి జరిగింది అన్నది జనం మదిలో గూడుకుట్టుకున్న మాట. అది నిజం కూడా…తెలంగాణలో నిత్య నరకం అనుభవిస్తున్న రైతును చూసి చలించి, సామాన్యుల వెతలు చూసి కన్నీళ్లు పెట్టుకొని, పిడికిలెత్త జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది ఒక్క కేసిఆరే… అందుకే ఆయనతోనే మేము..మా కోసమే కేసిఆర్‌ అని ప్రజలు బలంగా నమ్ముతున్నాడు. మూడోసారి కేసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *