ఎటు చూసినా ఆ రోజుల్లో చీకట్లే!

`ఈ రోజు తెలంగాణ అంతటా వెలుగులే!!

`అది కేసీఆర్‌ ఘనత…కేసీఆర్‌ దార్శనికత.

`తెలంగాణ తల రాత మార్చిన దేవుడు కేసీఆర్‌.

`చీకటి నుంచి తెలంగాణను వెలుగులోకి తెచ్చిన సూర్యుడు కేసీఆర్‌.

`తెలంగాణ వచ్చిన కొద్ది రోజుల్లోనే మా కళ్లతో చూసిన ప్రగతిని నమ్మలేనంతగా పరుగులు పెట్టించిన పాలకుడు కేసీఆర్‌ అంటున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆనాటి ఆసక్తికరమైన అంశాలు..దయన్న మాటల్లోనే..

`సభల నిర్వహణలో చరిత్రలు సృష్టించాలన్నా, ఆ చరిత్రలు తిరగ రాయాలన్నా బిఆర్‌ఎస్‌ కే సాధ్యం.

`సభలు విజయవంతం కావడానికి కేసీఆర్‌ ఒక్క పిలుపు చాలు.

`తెలంగాణ మొత్తం కదులుతుంది.

`బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ నాడు తెలంగాణ మొత్తం వరంగల్‌ లోనే వుంటుంది.

`తెలంగాణ ప్రజలంతా కలిసి బీఆర్‌ఎస్‌ రజతోత్సవ పండగ జరుపుకుంటుంది.

`తెలంగాణ వచ్చిన మూడు నెలల్లోనే కేసీఆర్‌ అద్భుతాలు సృష్టించారు.

`ఆరు నెలల్లోనే పల్లె, పట్నం అని తేడా లేకుండా కరెంటు నిరంతరం సరఫరా చేశారు.

`తెలంగాణలో అందరూ ఆశ్చర్యపోయారు.

`అంత కాలం ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కానిది ఎలా సాధ్యమైందో ఊహించలేకపోరు.

`అదే ఏడాదిలో తెలంగాణలోని చెరువులకు నీళ్లొచ్చాయి.

`దశాబ్దాల తరబడి చుక్క నీరు లేక ఎండిపోయిన చెరువులు నిండాయి.

`ఎప్పుడో ఎండిపోయిన వాగులు, వంకల్లో ఎండాకాలంలో నీళ్లు పారాయి.

`మిషన్‌ భగీరథ పేరుతో చెరువులన్నీ కూడికలు తీయడం జరిగింది.

`ఎండాకాలంలో చెరువులు మత్తళ్లు దుంకుతుంటే రైతులు సంబురపడ్డారు.

`తెలంగాణ ప్రజల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.

`ఇలా చెప్పుకుంటూ పోతే పదేళ్లలో తెలంగాణ రూపురేఖలే మారిపోయాయి.

`తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్‌ పాలకుడై మట్టిని కూడా బంగారం చేశారు.

`తెలంగాణను అన్నపూర్ణ చేసి దేశానికే అన్నం పెట్టే దశకు తెచ్చాడు.

`అందుకే కేసీఆర్‌ చరిత్రకే కొత్త బాష్యం చెప్పిన పాలకుడయ్యారు.

`60 ఏళ్లు తెలంగాణను పట్టిన శనిని వదిలించాడు.

`ఈ తరం యువతకు కేసీఆర్‌ చేసిన త్యాగం తెలియాలి.

`కేసీఆర్‌ చేసి చూపిన అభివృద్ధి బిఆర్‌ఎస్‌ ప్రతి కార్యకర్త యువతకు చెప్పాలి.

`ఇంతటి అభివృద్ధి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ చేయలేదు.

`ఇంకా వెయ్యేళ్లయినా కేసీఆర్‌ చరిత్ర చెరిగిపోదు.

`తెలంగాణ వున్నంత వరకు బీఆర్‌ఎస్‌ ఎదురుండదు.

`అప్పుడప్పుడు ఒడిదొడుకులు వచ్చినా మళ్ళీ కెరటంలా ముందుకొచ్చేది బిఆర్‌ఎస్‌ పార్టీయే.

`తెలంగాణను కాపాడుకునేది బీఆర్‌ఎస్‌ పార్టీనే

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసిఆర్‌. తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన పాలకుడు కేసిఆర్‌. ఒక్క మాటలో చెప్పాలంటే కేసిఆర్‌ తెలంగాణ దేవుడు. ఎందుకంటే కేసిఆర్‌ లేకుండా తెలంగాణ ఉద్యమమే లేదు. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణకోసం ఎన్ని రకాల ఉద్యమాలు సాగినా, గతంలో రాలేదు. ఉద్యమం ఎంతో కొంత సజీవంగా వుండేదేమో? కాని డిల్లీ పాలకులు తెలంగాణ ఇచ్చేందుకు ఇష్టపడకపోదురు. అడుగడుగునా అటు కాంగ్రెస్‌ పార్టీ, ఇటు బిజేపి రెండూ తెలంగాణ ఇవ్వడానికి సుముఖంగా వుండేవి కాదు. కేసిఆర్‌ లేకుండా అంత బలమైన ఉద్యమం చేసేవారు వుండేవారు కాదు. కేసిఆర్‌ నాయకత్వంలో బలమైన తెలంగాణ ఉద్యమం సాగుతున్న తరుణంలో దేశంలో బిజేపి మూడు రాష్ట్రాలను ప్రకటించింది. కాని తెలంగాణ ఇవ్వలేదు. 1998 కాకినాడ సభలో ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తీర్మాణం చేసిందే గాని, తెలంగాణ ఇవ్వడానికి చేతులు రాలేదు. ఒక దశలో అప్పటి ఉప ప్రధాని అద్వానీ హైదరాబాద్‌ తెలంగాణ నడిబొడ్డులో వుంది. ప్రత్యేక రాష్ట్ర ఎందుకు? అని ఎదరు ప్రశ్నించారు. ఏపి నాయకుల మాటలే కేంద్రంలో చెల్లుబాటయ్యేవి. తెలంగాణ నాయకులు ఎంత బలమైన వాళ్లైయినా వారికి ప్రాదాన్యత వుండేది కాదు. పైగా తెలంగాణ ఇవ్వమని అడిగేంతే శక్తి అప్పటి రెండు పార్టీల నాయకులకు లేదు. తొలి తరం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంత పెద్ద పోరాటం జరిగినా ఇందిరా గాందీ ఒప్పుకోలేదు. తెలంగాణ ప్రజా సమితి 11 సీట్లు సాధించినా తెలంగాణ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ఉద్యమం సాగినా అవి డిల్లీ దాకా తెలంగాణ వాణి వినిపించేంత గట్టిగా సాగలేదు. కాని ఒక్క కేసిఆర్‌ మొదలు పెట్టిన ఉద్యమమే డీల్లీని తాకింది. డిల్లీని వణికించింది. అంతగా డిల్లీ మెడలు వంచిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు. అందుకే తెలంగాణ వచ్చింది. పట్టిన పట్టు విడవకుండా, ఎన్ని అవరోదాలు ఎదరైనా ఉడుం పట్టు పట్టినట్లు ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ ఆమరణ నిరసన దీక్ష సమయంలో కేసిఆర్‌ చెప్పిన మాటలనే అప్పటి హోం మంత్రి చిదంబరం చదివారంటే కేసిఆర్‌ బలం ఏమిటో అర్దం చేసుకోవచ్చు. ఆసుపత్రిలో ఆమరణ నిరసనలో వున్న నాయకుడు ఏది చెబితే అది చదువుతాం..తెలంగాణ ఇస్తామని కేంద్రం దిగి రాకతప్పలేదు. 2009 డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేయకతప్పలేదు. అలా డిల్లీని శాసించి తెచ్చిన కేసిఆర్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందంటున్న మాజీ మంత్రి వర్యులు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో పంచుకున్న తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్ధితులు, అభివృద్ది గురించి చెప్పిన ఆసక్తికరమైన అంశాలు..ఆయన మాటల్లోనే..
తెలంగాణ ప్రకటన వచ్చిన రోజే రాత్రికి రాత్రి ఏపికి చెందిన ఉమ్మడి పాలకులు లేని కృత్రిమ ఉద్యమాన్ని కొన్ని గంటల్లోనే రేపినా, తెలంగాణను అడ్డుకున్నా, తెలంగాణ సాధించే వరకు విశ్రమించని నాయకుడు కేసిఆర్‌. తొలుత కేసిఆర్‌ చెప్పిన మాటల మీద ఇతర పార్టీలకు కూడా కొంత నమ్మకం కలగలేదు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలంగాణ రావాలని వున్న అప్పటి పరిస్టితుల దృష్ట్యా పార్టీల సిద్దాంతాలకు కట్టుబడి రాజకీయం చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే డిసెంబర్‌ 9న తెలంగాణ ప్రకటన చేశారో అప్పుడు అన్ని పార్టీలలోనే కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి ఒక నమ్మకం ఏర్పడిరది. అప్పటి నుంచి బిఆర్‌ఎస్‌ నాయకత్వంలో కేసిఆర్‌ నేతృత్వంలో ఐదేళ్లపాటు సాగిన ఆ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. సకల జనులు పాలుపంచుకున్న ఉద్యమం ఏదైనా వుందంటే అది తెలంగాణ ఉద్యమమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో అప్పటి రాజులుకొంత మంది వ్యతిరేకించారు. కాని తెలంగాణ ఉద్యమం మాత్రం ఏ ఒక్క వర్గం వద్దనలేదు. జై తెలంగాణ అని అనకుండా వుండలేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు తెలంగాణలో ఎక్కడ చూసినా జై తెలంగాణ నినాదామే..వినిపించేది. పెళ్లిల్లయినా, పేరంటాలైనా, ఏ ఇతర శుభకార్యాలైనా, సభలైనా, సమావేశాలైనా సరే తెలంగాణ పాటలు తప్ప మరో పాట వినిపించేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా సాగిన దూంధాంలు, నిరసనలు, సకల జనులసమ్మెలు, ఉద్యోగుల పెన్‌ వంటి అనేక రకాల ఉద్యమాలకు, పోరాటాలకు కేసిఆర్‌ చేసిన రూపకల్పన అంతిమంగా విజయం సాదించింది. తెలంగాణ తెచ్చింది. మరి వచ్చిన తెలంగాణ ఎలా అభివృద్ది అన్నదానిపై అందరికీ సందేహాలుండేవి. ఎందుకంటే అప్పటికే ఉమ్మడి పాలకులు కొన్ని అపోహలు సృష్టించారు. తెలంగాణ వస్తే కరంటు కోతులు, చీకటి రాత్రేలే కాదు, పగలు కూడా కరంటు చూడలేరంటూ చెప్పే వారు. ఆ మాటలు నిజమే కావొచ్చన్న అనుమానాలు సగటు తెలంగాణ ప్రజలకు కూడా వుండేది. ఏ చీకటి రాత్రుల గురించైతే అప్పటి పాలకులు చెప్పారో ముందు ఆ చీకటే లేకుండా చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కింది. తెలంగాణ రాకముందు తెలంగాణ అంతటా చిమ్మ చీకట్లే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మరింత ఉదృతమైన సందర్భంలో సుమారు ఐదారేళ్లపాటు కరంటు కోతలు ఎక్కువ, సరఫరా తక్కువ జరిగేది. ఇక పల్లెల్లో అయితే రోజుకు కనీసం గంట కూడా కరంటు వుండేది కాదు. ఆ గంటలో కూడా కోతలుండేవి. అంటే ఆ రోజులు ఎంత భయంకరంగా వుండేవో అర్ధం చేసుకోవచ్చు. కాని తెలంగాణ వచ్చిన మూడు నుంచి ఆరు నెలల్లో తెలంగాణలో నిరంతరం కరంటు సరఫరా చూసి ప్రజలు ఆశ్యర్యపోయారు. తెలంగాణ ప్రజలు అబ్బురపడ్డారు. సంతోషంతో కేసిఆర్‌ను వేనోళ్ల పొగిడారు. తెలంగాణ వస్తే చీకట్లే అన్న వారికి కూడా వెలుగులు చూపించారు. ఇదెలా సాద్యమైందో అని ఏపి ప్రజలు కూడా ఒకింత ఆశ్చర్యచకితులయ్యారు. ఆ పాత చీకటి రోజులు చూసిన తెలంగాణ ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నిండాయి. దానికి తోడు తెలంగాణలో రైతులందరికీ 24గంటల ఉచిత విద్యుత్‌ కేసిఆర్‌ ఇచ్చారు. రైతులు 24 గంటల కరంటు వద్దని చెప్పే పరిస్దితి వచ్చింది. అంతగా రైతాంగాన్ని ఆదుకున్న ఏకైన రైతుబాంధవుడు కేసిఆర్‌. ఇక తెలంగాణ కరువును ఏడాదిలో కంటకి కనిపించకుండా చేసిన నాయకుడు కేసిఆర్‌. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ పాలకుడు కాకుంటే ఇవన్నీసాద్యమయ్యేవి కాదు. అసలు ఆయన ఆలోచనలు, ఆచరణలు ఎవరికీ అంతు పట్టలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే సాగునీటి కోసం ఆయన చేసిన గొప్ప ప్రయత్నం మిషన్‌ కాకతీయ. అసలు తెలంగాణను ఒక్క ఏడాదిలో సస్యశ్యామలం చేయొచ్చని ఎవరూ ఊహించలేదు. 60 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా, కనీసం చుక్క నీటిని ఇచ్చేందుకు కూడా ఉమ్మడి పాలకులకు మనసు రాలేదు. తెలంగాణలో చెరువులు బాగుచేస్తే, కరువు ఛాయలు కొంతైనా తగ్గుతాయని ఆలోచించలేదు. ఎందుకంటే తెలంగాణకు నీళ్లిస్తే, ఏపికి నీరు తగ్గుతుందన్న భయంతో ఉమ్మడి పాలకులు తెలంగాణను నిర్లక్ష్యంచేశారు. చెరువులను చెదరగొట్టారు. అటు కరువు చాయలు, ఇటు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యాల మూలంగా తెలంగాణ ఆగమైంది. తెలంగాణ ఎడారిలా మారిపోయింది. కాని కేసిఆర్‌ ఏడాది కాలంలో తెలంగాణలో వున్న చెరువుల రక్షణ, పరిరక్షణ, పునరుద్దరణ పేరుతో చెరువులన్నీ బాగు చేశారు. మూడేళ్లలో 46వేల చెరువులకు పూర్వ వైభవం తెచ్చారు. ఎండాకాలంలో కూడా తెలంగాణ చెరువులు మత్తళ్లు దుంకేలా నీరందించారు. నిరంతరం గొలుసు కట్టు చెరువుల్లో నీరుండేలా..ఆ చెరువుల నుంచి ఇతర చెరువులకు నిరంతరం నీరు పారేలా చూశారు. దాంతో వాగులు వంకల్లో కూడా నీరు నిరంతరం ప్రవహిస్తూ వచ్చింది. తెలంగాణలో భూగర్భ జలాలు అప్పటికే గణనీయంగా పెరిగాయి. రైతుకష్టం పూర్తిగా తీరింది. ఒకప్పుడు కరంటు లేక, బోర్లు ఎండిపోయి, పంటలు చేతికి రాకుండా చితికిపోయిన రైతులకు ఒక్కసారిగా పండుగ తెచ్చిన దేవుడు కేసిఆర్‌. అలా చెరువులతోపాటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం దానికి అనుసంధానంగా పెద్దఎత్తున రిజర్వాయర్లు నిర్మాణం చేపట్టి, తెలంగాణకు నీటి కొరత లేకుండా చేశారు. తెలంగాణలో గుంట భూమి కూడా సాగుకాకుండా రైతులు వ్యవసాయం చేశారు. పల్లెలను పచ్చని వనాలే కాదు, దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారాలు చేశారు. నేను పంచాయితీరాజ్‌ శాఖ మంత్రిగా ఐదేళ్ల కాలంలో తెలంగాణకు ఏటా పదుల సంఖ్యలో అవార్డులు అందుకోవడం నా జన్మ చరితార్ధకమైంది. అసలు ఎలా వుండే తెలంగాణ ఎలా తెలివికొచ్చింది. ఎంత అభివృద్ది చెందింది. కలలో కూడా ఎవరూ ఊహించనంత ప్రగతి సాదించింది. అందుకే కేసిఆర్‌లో ఒక కారణజన్ముడు. ఆయన స్ధాపించి బిఆర్‌ఎస్‌ తెలంగాణకు ఒక రక్షణ కవచం. బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలు అంటే అది ప్రజల పండుగ. తెలంగాణ ప్రజల గుండెలందరి నిండుగా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!