Telangana leader kcr
జనం గుండెల్లో సారే బడి గుడి.
`జనసర్వస్వమంతా కేసీఆర్ మది.

`తెలంగాణ కోసం పడరాని పాట్లు పడిన నాయకుడు.
`తెలంగాణ కోసం అందరి మెట్లు ఎక్కి దిగిన నాయకుడు.

`తెలంగాణ విషయంలో బేషజాలకు పోలేదు.
`అభివృద్ధిలో ఎక్కడా రాజీపడలేదు.

`తెలంగాణ కన్నీరు తూడ్చడం కోసం పదేళ్లు కంటి నిద్ర పోలేదు.
`తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కడుపు సరిగ్గా తిన్నది లేదు.
`రాజకీయ విలువలకు ప్రాణం పెట్టిన నాయకుడు కేసీఆర్.
`అవకాశ వాద రాజకీయాలకు తావివ్వని నాయకుడు కేసీఆర్.
`గెలుపోటముల గురించి ఏనాడు మధనపడలేదు.
`ప్రజలు ఓడిపోవద్దని తాపత్రయ పడిన నాయకుడు కేసీఆర్.
`నా ప్రజలు మళ్ళీ మోసపోవద్దని భావించిన నాయకుడు.
`నా ప్రజలు కలలో కూడా గోస పడొద్దని కోరుకున్న నాయకుడు.
`ప్రజలు కష్టాలు పడుతుంటే చూడలేక తల్లడిల్లిపోతున్నాడు.
`పదేళ్లలో తెలంగాణను నందనవనం చేసిన నాయకుడు.
`మోడువారిపోతున్న తెలంగాణకు జీవం పోసే నాయకుడు కేసీఆర్.
`అందుకే మళ్ళీ జనమంతా కేసిఆర్ జపం చేస్తున్నారు.
`కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు
`ఎక్కడ విన్నా కేసీఆర్ పాటలతో నృత్యాలు చేస్తున్నారు.
`కేసీఆర్ పై తమ అభిమానాన్ని ప్రపంచానికి చాటేలా తెలియజేస్తున్నారు.
`ఉరకలెత్తే ఉత్సాహం జై కేసీఆర్ అని నినదిస్తున్నారు.
`‘‘జూబ్లీ హిల్స్’’ జనమంతా ‘‘కేసిఆర్’’ నామస్మరణే చేస్తున్నారు.
హైదరాబాద్, నేటిధాత్రి: రాజకీయాలంటే కేసిఆర్‌కు ఆట విడుపు కాదు. అధికారం కోసం అసలేకాదు. ప్రజల కోసం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజా చైతన్యంకోసం, వారి జీవితాల్లో వెలుగుల కోసం. ఇదీ కేసిఆర్ రాజకీయం. అందుకే తెలంగాణ సాదన కోసం ఎవరూ చేయని త్యాగం చేశారు. పోరాటం చేశారు. ఉద్యమాన్ని ఎత్తుకొని తెలంగాణ సాదించారు. జీవితమే పోరాటం చేసుకొని ముందుకు సాగారు. తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా ముందుకెళ్లారు. తెలంగాణ మొత్తం ఏకం చేశారు. తెలంగా మొత్తం కేసిఆర్ గొంతుగా మార్చారు. అందుకే ఇప్పుడు ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒకటే మాట. ఒకటేపాట. ఒకటే బొమ్మ. అది కేసిఆర్. సారే రావాలంటున్నది తెలంగాణ అంటూ ఉద్యమ కాలంలో ఎలా వినిపించిందో ఇప్పుడూ అదే వినిపిస్తుంది. అంతకన్నా వంద రెట్లు ఎక్కవ వినిపిస్తుంది. పండగైనా, పబ్బమైనా సరే కేసిఆర్ పాట లేకుండా జరగడం లేదు. పెండ్లిల్లో కేసిఆర్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. బరాత్‌లల కేసిఆర్ పాటలు పెట్టుకుంటున్నారు. ఆఖరుకు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో, ఊరేగింపుల్లో కూడా ఎక్కడ విన్నా కేసిఆర్ పాటలే. బతుకమ్మ ఆడిన సందర్భాలలో కేసిఆర్ పాటలే వింటున్నారు. పల్లెల్లో ఎవరిని కదిలించినా కేసిఆర్ జపం చేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. కేసిఆర్‌ను తల్చుకోకుండా రోజు గపడం లేదు. ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో తెలంగాణలోని మహిళలు, పెద్దలు, వృద్దులు, రైతులు అన్ని వర్గాలు కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్ల పాలన గురించి చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కేసిఆర్ తెచ్చిన నీళ్లను గురించి చెప్పుకుంటున్నారు. కేసిఆర్ నింపిన చెరువులు గురించి చెప్పుకుంటున్నారు. ఇంటింటికీ ఇచ్చిన మిషన్ భగీరధ నీళ్ల గురించే చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కాలువలు తెచ్చిన కేసిఆర్ గురించే చర్చలు పెడుతున్నారు. పదేళ్లు పంటలు ఎండిపోకుండా చూసుకున్న కేసిఆర్ గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటును తల్చుకుంటున్నారు. పదే పదే కరంటు పోతున్నప్పుడల్లా కేసిఆర్ వున్నప్పుడు ఒక్కసారి పోకపోతుండే అనుకుంటున్నారు. ఇలా ఏ సందర్భమైనా సరే కేసిఆర్‌ను ప్రతి పల్లె తల్చుకుంటోంది. ప్రతి పట్టణం గుర్తు చేసుకుంటోంది. అందుకే కేసిఆర్ కేసిఆరే అంటోంది. ఒకటా రెండా..కేసిర్ చేసిన మంచి పనులు జనం గుండెల్లో నిలిచిపోయాయి. వారికి ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు రూ.200 వున్న పించన్ తెలంగాణ రాగానే ఒకేసారి రూ.1000కి పెంచారు. తర్వాత మళ్లీ రూ.2000 వేలు చేశాడు. దివ్యాంగులకు ఏకంగా రూ.6500 పించన్ ఇచ్చాడు. కుల వృత్తుల దారులకు పించన్లు ఇచ్చాడు. ఇలా 57 సంవత్సరాలు దాటిని సుమారు 46లక్షల మందికి పించన్లు ఇచ్చి, ఆ కుటుంబాలను అదుకున్నారు. ఇక కేసిఆర్ రైతులకు చేసిన మేలు ప్రపంచంలో ఏ పాలకులు చేయలేదు. ఏ నాయకులు రైతుల మేలు కోసం ఆలోచించలేదు. రైతు బంధు పేరు మీద పెట్టుబడి సాయం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి ఆలోచన ఒకటి చేయొచ్చని స్వతంత్ర భారతావినిలో ఏ నాయకుడు, పాలకుడు ఆలోచించింది లేదు. రైతుల మేలు కోరి సాయం చేసింది లేదు. రైతులు రుణగ్రస్తులు కాకుండా చూసుకున్నది లేదు. తెలంగాణ రాక ముందు రైతు అనే పేరు చెప్పుకోవడానికి కూడా కన్నీళ్ల పర్యంతమైపోయేవారు. పడావు బడ్డ భూములను చూసి దుక్కిస్తుండేవారు. ఎండిన దుక్కిని చూసి కళ్ళతో తడుపుకోవాలని అనుకునేవారు. ఆశాకం చేసి చూస్తూ, వానమ్మా రావమ్మా అంటూ పాటలు పాడుకుండే వారు. కరువు తప్ప కాలం కాకపోయినా, భూమిని నమ్ముకొని మన్ను తిని బతికారు. కూలీలుగా మారి జీవితాలు గడుపుకున్నారు. ధైర్యం వున్న వాళ్లు ఊరెళ్లిపోయారు. పొట్ట చేత పట్టుకొని అప్పులు చేసుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ రైతులంతా రాజులయ్యారు. కేవలం తెలంగాణ రాగానే రాజులైన రైతులకు అన్నీ సౌకర్యాలను కల్పించి, రారాజులను చేశాడు. రైతులు రారాజుల్లా కాలుమీద కాలేసుకొని బతికేలాచేశాడు. నీళ్లిచ్చాడు. పెట్టుబడి సాయం చేశాడు. సకాలంలో అవసరమైన ఎరువులు అందించాడు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాడు. పండిన పంటను కళ్లాలలోనే కొనుగోలు చేశాడు. మూడురోజుల్లో వడ్లపైకం బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ప్రతి సారి టంగ్ టంగ్ మని పెట్టుబడి సాయం అందించాడు. పంటలు నష్టపోతే నష్టపరిహారం వెంటనే అందించాడు. ఇలా అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న ప్రపంచంలోనే ఏకైక నాయకుడు కేసిఆర్. రాజకీయాల్లో నైతిక విలువలు అంటే అర్దం కేసిఆర్ అనే చెప్పాలి. తెలంగాణ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్లు తన రాజకీయం కన్నా, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. తెలంగాణ అభివృ ద్దిలోనూ ఎక్కడా రాజీ పడలేదు. తెలంగాణ తెచ్చి, ఎలా బంగారు తెలంగాణ చేయాలో తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్. అందుకే తెలంగాణ అరవై ఏండ్లు గోసపడగింది చాలు. ఇంక ఎప్పుడూ గోస పడొద్దని అనుకున్న నాయకుడు కేసిఆర్. అరవై ఏళ్లలో తెలంగాణ పడిన గోసను, ఆరేళ్లలో తీర్చిన గొప్ప దార్శనికుడు కేసిఆర్. తెలంగాణ తేవడం కోసం కడుపు నిండా తిన్నది లేదు. తెలంగాణ బాగు కోసం కంటి నిండా నిద్రపోయింది లేదు. అందుకే తెలంగాణ ఇప్పుడు ఇలా వెలుగుతోంది. లేకుంటే అదే పాత కాలపు చీకట్లోనే మగ్గుతూ వుండేది. బిఆర్ఎస్ను వీడిన వాళ్లయినా సరే కేసిఆర్ వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించిన సందర్భం లేదు. పార్టీలు మారిని ఎమ్మెల్యేలు కూడా కేసిఆర్ గొప్పదనమే గుర్తు చేస్తారు. తన జేబులో పెన్ను వున్నా, ఆఖరుకు అది కూడా ఇతరులకు ఇచ్చే మనస్తత్వం కేసిఆర్‌ది అని కేశవరావు చెప్పిన మాట అందరూ విన్నదే. అంటే రాజకీయంగా విభేదించి వెళ్లిన వారు కూడా కేసిఆర్‌ను పల్లెత్తు మాట అనాలంటే కూడా నోరు రాదు. అదీ కేసిఆర్ నాయకత్వం విశిష్టతకు సంకేతం. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఆయన అనుసరించిన తీరు అందరి చేత ప్రశంసలు అందుకుంటూనే వుంటుంది. ఎమ్మెల్యేల మరణంతో వచ్చిన ఏ ఉప ఎన్నికైనా సరే వారి కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం కేసిఆర్‌కు తెలుసు. రాజకీయాల కోసం ఆయన ఇతరులకు సీట్లు కేటాయించింది లేదు. గెలిచినా, ఓడినా నైతికతను ఆయన ఏనాడు వదిలిపెట్టలేదు. అయితే కేసిఆర్ వల్ల మేలు పొంది, రాజకీయంగా ఎదిగిన వారిలో కొంత మంది స్వార్ధపరులుంటారు. వారి అవకావాద రాజకీయాలను చూపిస్తుంటారు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు. అలాంటి వారు మాత్రమే కేసిఆర్‌ను విమర్శిస్తుంటారు. అంతే కాని తెలంగాణలోని ఏ పార్టీ నాయకులైనా, ఏ సమాజమైనా సరే కేసిఆర్ వ్యక్తిత్వాన్ని శంకించేందుకు ఇష్టపడరు. అంత గొప్పది కేసిఆర్ నాయకత్వం. కొందరు కురుచ గుణం వున్న నాయకులు చేస్తున్న విమర్శల వల్ల వాళ్లే చులకనౌతున్నారు. కేసిఆర్ గ్రాఫ్ మరింత పెంచుతున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్ధులే ప్రజల కన్నా ఎక్కువగా కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కేసిఆర్ పేరు పదేపదే తల్చుకుంటూ రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత పాలక పెద్దలందరూ నిత్యం కేసిఆర్ జపం చేస్తూనే పూట గడుపుకుంటున్నారు. ప్రతి సందర్భంలోనూ పదే పదే పలు సార్లు గుర్తు చేసుకుంటున్నారు. తాము చేసిందేమీ చెప్పలేక, కేసిఆర్‌ను నిందించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. బొక్కా బోర్లా పడుతున్నారు. తెలంగాణ కథ మళ్లీ మొదలైంది. ఇప్పుడే మొదలైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో మళ్లీ మొదలౌతోంది. జనమే చూసుకుందామని ఇతర పార్టీలకు సవాలు విసురుతున్నారు. కేసిఆర్ ఫోటోను పక్కన పెట్టుకొని కొండంత ధైర్యం యువత ప్రదర్శిస్తున్నారు. దటీజ్ కేసిఆర్ అని యువత నోట జాలు వారుతుంటే కేసిఆర్ గర్జన వినిపిస్తోంది.
