
రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండా నే
ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం గర్ముళ్ళపల్లి రాఘవపురం గిద్ద ముత్తారం గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 30 జరిగే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి
రైతుబంధు రూ.16,000/- మొదటి ఏడాదినుంచే రూ॥ 12,000/- దశలవారిగా ఐదేండ్లలో రూ॥ 16,000/-లకు పెంపు.
కేసిఆర్ భీమా… ప్రతి ఇంటికి భీమా రూ॥ 5 లక్షల బీమా ప్రతి కుటుంబానికి రూ॥ 5లక్షల బీమా సౌకర్యం తెల్ల రేషన్ కార్డున్న 93 లక్షల కుటుంబాలకు లబ్ధి.
అన్నపూర్ణ పథకం ద్వారా అందరికీ సన్నబియ్యం రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులపై సన్న బియ్యం సరఫరా.
గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల నేపథ్యంలో పేద కుటుంబాలకు రూ 400కే వంట గ్యాస్ సిలిండర్…
పేదలకు ఇండ్ల స్థలాలు రాష్ట్రంలోని ఇంటి జాగలేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు సమకూర్చనున్న బీఆర్ఎస్ ప్రభుత్వం..
అగ్రవర్ణ పేదలకు గురుకులాలు ప్రతి నియోజక వర్గానికి “ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదలు కోసం గురుకుల నిర్మాణం.
ఆసరా పెన్షన్ 5,016/- దివ్యాంగులకు 6,000/- దశల వారీగా పెంపుదల మొదటి ఏడాది రూ॥ 3,016/- అందజేత.
కేసిఆర్ ఆరోగ్య రక్ష 15 లక్షలు ‘అర్హులైన పౌరులందరికీ ప్రస్తుతం అందిస్తున్న ఆరోగ్య బీమా పరిమితిని రూ॥ 15 లక్షలకు పెంపు..
సౌభాగ్యలక్ష్మి రూ॥ 3,000 అర్హులైన పేద కుటుంబాల మహిళలకు జీవనభృతి..
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు దశల వారీగా రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలకు సొంత భవనాల నిర్మాణం.
అసైన్డ్ భూములపై ఉండే ఆంక్షలు ఎత్తివేసి యాజమాన్యం ” హక్కుల కల్పనకు కృషి..
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు 2018 రెండవ సారి అవకాశం కల్పిస్తే నేను, నా సతీమణి ఇద్దరం నియోజకవర్గమే కుటుంబంగా భవిస్తూ సేవాలందిస్తున్నాం.
ఎమ్మెల్యేగా పరిపాలన అందిస్తూ, మా తండ్రి పేరు మీద జిఎంఆర్ఎం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ, నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తున్నాం.
విద్య కోసం నా దగ్గరికి ఎవరు వచ్చినా జిఎంఆర్ఎమ్ ట్రస్ట్ ద్వారా తోచిన స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నా.
భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ దావకానలో రోగి తో పాటు వచ్చిన అటెండర్ కు గడిచిన మూడేళ్లుగా నిత్యం. మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ స్థాయి వైద్యపకులను తీసుకువచ్చి వారికి ఉచితంగా ఎస్సై కానిస్టేబుల్,గ్రూప్స్ కోచింగ్ అందించి వారికి అండగా నిలవడం జరిగింది.
నాకు దైవభక్తి ఎక్కువ మా నాన్న నాకు తిరుమల వెంకన్న పేరు నామకరణం చేయడంతో నా ఇష్ట దైవంగా ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని భూపాలపల్లి మంజునగర్లో దేవాలయం నిర్మిస్తే దేవాలయంపై కూడా రాజకీయం చేస్తున్న సన్యాసులకు ప్రజలు బుద్ధి చెప్పాలి.
దేవాలయం ఏర్పాట్లు ఏ ఒక్కరు సహాయం తీసుకోకుండా. ఆలయం నిర్మిస్తున్న క్రమంలో చాలామంది భక్తులు ముందుకు వచ్చి మేము కూడా భాగస్వామ్యం అయితామని వస్తుంటే నేను నేరుగా తీసుకోకుండా ఆలయం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కి బ్యాంకు ద్వారా వారు విరాళాలు అందించారు. అయినప్పటికీ నా కుటుంబ సభ్యులు బంధువులు నియోజకవర్గ ప్రముఖులు డబ్బులు తో ఆలయం నిర్మించే తప్ప ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి జెడ్పిటిసి తిరుపతిరెడ్డి సర్పంచుల పూర్వం మండల అధ్యక్షుడు గుడిగంట మహేందర్ ఎంపీటీసీల పురం మండల అధ్యక్షుడు సంగీ రవి సర్పంచి రమా రవీందర్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు