లక్షల కోట్లు అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్న కెసిఆర్.

Congress members.

లక్షల కోట్లు అవినీతి చేసి నీతులు మాట్లాడుతున్న కెసిఆర్

గంగారం, నేటిధాత్రి

బిఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన రజత్సోహ సభ కార్యక్రమం లో నీతి వ్యాక్కలు మాట్లాడిన కెసిఆర్ మా ప్రశ్నలకు జవాబు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి సంయుక్త ప్రకటన చేశారు..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ప్రాజెక్టులు కట్టాము, సంక్షేమ పథకాలు అమలు చేశామని కేసీఆర్ గారు చెప్పుకున్నారు. కానీ ఈ పథకాలు, ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన విషయాన్ని, వాటి ద్వారా కేసీఆర్ గారి కుటుంబం కమీషన్లు తీసుకున్న విషయాన్ని మాత్రం దాచేశారు. ఇలా కేసీఆర్ గారి కుటుంబం కమిషన్ల రూపంలో దోచుకున్న ప్రభుత్వ సొమ్మును తిరిగి ఖజానాకు రాబట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేయడానికి నిధులు అవసరం కన్నా ఎక్కువే సమాకూరుతాయి. అసెంబ్లీకి వస్తే, కాంగ్రెస్ సభ్యులు ఈ విషయంపై నిలదీస్తారనే భయంతో.. తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతి అన్నట్లు కేసీఆర్ గారి వైఖరి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి, హద్దులు దాటవద్దని కేసీఆర్ గారు పోలీస్ వారికి వార్నింగ్ ఇవ్వడం చాలా విడ్డూరం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను తొత్తులుగా వాడుకుని, చట్ట విరుద్ధంగా పోలీసులతో ప్రత్యర్థుల ఫోన్లు టాప్పింగ్ చేయించారు. మీ ఉచ్చులో పడిన కొందరు పోలీసు అధికారులు హద్దులు దాటడం వల్ల, ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి, దొంగల మాదిరిగా దాక్కోవాల్సిన దుస్థితి వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో వరంగల్ బిడ్డలు శృతి, సాగర్‌లను కిరాతకంగా ఎన్కౌంటర్ చేయించిన కేసీఆర్ గారు, గద్దర్ గారు కలవడానికి వస్తే ప్రగతిభవన్ గేట్లను కూడా తెరవని కేసిఆర్ గారు… ఇప్పుడు మావోయిస్టులను చర్చలకి పిలవాలని కేంద్రాన్ని డిమాండ్ చెయ్యడం కేవలం అవసరవాదం.పాతికేళ్ళ బీఆర్ఎస్ ప్రస్థానంలో తెలంగాణను అభివృద్ధి చేశామని కేసిఆర్ గారు చెప్తున్నారు ఈ పాతిక సంవత్సరాలలో తెలంగాణ ఆర్ధిక అభివృద్ధి కంటే కేసిఆర్ గారి కుటుంబ సభ్యుల ఆర్ధిక స్థోమత ఎన్ని వేల రెట్లు పెరిగిందో చర్చిండానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం. బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి ముందు కేసిఆర్ గారి కుటుంబ సభ్యుల ఆస్తులు ఎంత.. ఇప్పుడు ఒకొక్కరి ఆస్తులు ఎన్ని వేలకోట్లకు చేరాయో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం సిద్ధమా…అని
వారు ప్రశ్ననించారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!