# వెనక ముందు ఎవరు లేరు..నాకు ప్రజలే దిక్కు.
# గ్యారంటీ వ్యారంటి లేని కాంగ్రెస్ పార్టీ
# వచ్చే కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికీ 5 లక్షల జీవిత భీమా పధకం..
# కాంగ్రెస్ పథకాలు మోసపూరిత పథకాలు..
# ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి..
# 6 వ రోజు జోరుగా ఎన్నికల ప్రచారం..
# అడుగడుగునా మంగళ హారతులతో మహిళల నీరాజనాలు..
# గులాబీమయమైన గ్రామాలు పల్లెలు…
నర్సంపేట నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నాక కెసిఆర్ సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని నేడు కేసీఆర్ మరోసారి ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో పథకాలతో పాటు తెలంగాణకు కెసిఆరే గ్యారెంటీ అయ్యారని నర్సంపేట బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా చేపట్టిన ఎన్నికల ప్రచారం శుక్రవారం నాటికి ఆరో రోజుకు చేరుకున్నది. దుగ్గొండి మండలంలో ముద్దనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే పెద్ది మొదలుపెట్టగా గుడ్డేలుగులపల్లి, చంద్రయ్యపల్లి, మల్లంపల్లి, బొబ్బరోనిపల్లి, మర్రిపల్లి, మహమ్మదాపురం, తిమ్మంపేట, నారాయణతండా చలపర్తి,రేకంపల్లి శివాజీ నగర్ మీదుగా కొనసాగుతూ తోగర్రాయి గ్రామంలో మొదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన మహిళలు వృద్ధులు బోనాలు, బతుకమ్మలు, మంగళహారతులతో నిరాజనాలు పలుకుతూ స్వాగతించారు. పలు గ్రామాలలో మహిళలు ఎమ్మెల్యే పెద్దికి వీర తిలకం దిద్దుతూ విజయకేతనం మనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
గ్రామ గ్రామాన కెసిఆర్ పెన్షన్ తీసుకునే వృద్ధులు మా ఓటు మరోసారి నీకే అంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి భరోసా కల్పించారు. ఎన్నికల ప్రచారాలలో ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ నేను రైతు కుటుంబం నుండి వచ్చిన మీ బిడ్డను నాకు ముందు వెనక ఎవరూ లేరు నాకు మీరు ప్రజలే దిక్కు అంటూ వేడుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల లొల్లి అభ్యర్థుల సీట్ల వద్దనే ఉన్నదని ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. విలువలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ నేడు గ్యారెంటీ, వారంటీ లేని పార్టీగా మారిందని ఆరోపించారు. 2014 ఎన్నికలలో మాధవ రెడ్డి గ్యారెంటీ లేదని ఉద్దేశంతో సీటు కేటాయించిందని దీంతో కాంగ్రెస్ పార్టీపై నానా బూతులు తిట్టిన మాధవరెడ్డికి కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి కోసం తట్టాడు మట్టి పోశాడా అని పెద్ది ఆరోపించారు.
నేడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన పథకాలు హన్మకొండ చౌరస్తాలో ఒకటి కొంటే రెండు గ్రారంటి లేని డ్రాయర్లు బనియన్లు ఉచితం అన్నట్లుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలు అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల చేతుల్లో పెట్టారని నేడు కేసీఆర్ పథకాలు లేని ఇల్లు లేదు అని తెలియజేశారు. రాబోయే కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. 2 లక్షల 16, రూ. 400 కే గ్యాస్ సిలిండర్, సౌభాగ్యవతి పథకం ద్వారా మహిళలకు నెలకు 3000 రూపాయలు లతోపాటు మేనిఫెస్టో పెట్టిన ప్రతి పథకాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వనున్నారని వివరించారు. కాంగ్రెస్ బిజెపి నాయకులు రాత్రికి రాత్రే ఒక్కటై నన్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు అయినా నేను చేసిన అభివృద్ధిని ప్రజలందరూ గ్రహిస్తున్నారు అని తెలుపుతూ ఇప్పటికే వేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశానని మరిన్ని పనులు పెండింగ్ లో వాటిని పూర్తి చేయాలంటే నేను గెలవాల్సిందే అని అందుకు మీరు మీ బిడ్డగా ఆశీర్వదించాలని ఆయా గ్రామాల్లోని ప్రజలను వేడుకున్నారు. ఎన్నికల ప్రచారంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్,ఎంపిపి కాట్ల కోమల భద్రయ్య,మండల పార్టీ అధ్యక్షుడు సుకీనే రాజేశ్వర్ రావు,ఎన్నారై సెల్ అధికార ప్రతినిధి,నియోజక వర్గ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్,
వైస్ ఎంపిపి పల్లాటి జైపాల్ రెడ్డి,మండల పార్టీ ఉపాధ్యక్షుడు బూర హేమచంద్ గౌడ్,సొసైటీ చైర్మన్లు మహిపాల్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ,పైడి,సర్పంచ్లు పల్లాటి భవాని కేశవరెడ్డి,రేవూరి సురేందర్ రెడ్డి, శంకేషు శోభ కమలాకర్,రమ, ఓడేటి
తిరుపతిరెడ్డి, మోడెం విద్యాసాగర్ గౌడ్, ముదురుకోల శారద కృష్ణ,ఇమ్మడి యుగంధర్, లింగంపెల్లి ఉమా రవీందర్,నీలం పైడయ్య,మల్లంపల్లి మాజీ సర్పంచ్ బైరి లలితరమణారెడ్డి,ఉప సర్పంచ్ లు తడుక కొమురయ్య గౌడ్,ముంజ రాజేశ్వరిసురేష్ గౌడ్,నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.