వికలాంగుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కృషి.

# వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం రూ 10 వేల కోట్ల నిధులు కేటాయించింది.
# దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి


# సాయంపొందిన మీరు నిండు మనస్సుతో నన్ను దీవించండి.
# గత ప్రభుత్వాలు ఓట్ల కోసం మళ్లీ వస్తున్నారు తస్మాత్ జాగ్రత్త..


# ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

# పెద్దన్న గెలుపుకై ఏకమైన దివ్యాంగులు.

# నర్సంపేటలో నియోజకవర్గ దివ్యాంగుల ఆశీర్వాద సభ.

నర్సంపేట,నేటిధాత్రి :
గత ప్రభుత్వాలు దివ్యాంగులకు ఏనాడు చేయని విధంగా ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వికలాంగుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రత్యేక కృషి ఎనలేనిదని అందుకు ఎల్లప్పుడు బిఅర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి పిలుపునిచ్చారు.త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుండి బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని సుమారు 3 వేల మంది దివ్యాంగులు దివ్యాంగుల ఆశీర్వాద సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిధులుగా రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి,ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ వికలాంగుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వికలాంగుల గౌరవాన్ని మరింత పెంచేందుకు గాను ఫెన్షన్ ను రూ 4వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దే అని అలాగే
అదే పెంక్షన్ ఆరు వేల వరకు పెంచుతామని ప్రకటించడం హర్షణీయం అని పేర్కొన్నారు.వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం రూ 10 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిందని, రాబోవు కాలంలో ఆ బడ్జెట్‌ మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
మన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి సామాజిక ప్రగతికి సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచి ప్రతి ఒక్కరు కారు గుర్తుపై ఓటు వేసి, పెద్దన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ

మిమ్ములను ఏనాడు పట్టించుకోని నాయకులను మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని దివ్యాంగులకు సూచించారు.అన్ని వర్గాల ప్రజలు ఇదే ఫార్ములాను ఫాలో అవ్వాలని కోరారు.
ఒకప్పుడు రెండు వందల రూపాయలు ఇచ్చి వారి ఆర్థిక సామాజిక స్థితగతులను అవమాన మార్చిన గత ప్రభుత్వాలు మళ్లీ ఓట్లకోసం వస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త అని ఎమ్మెల్యే పెద్ది పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో ప్రతీ దీర్ఘకాలిక సమస్యను సాధ్యమైనంత వరకు తీర్చగలిగినా అన్ని వర్గాల ప్రజల బాగోగులు గూర్చి అనుక్షణం ఆలోచించే వ్యక్తిని నేను.
నర్సంపేట వ్యవసాయాభివృద్దిలో అగ్రగామిగా నిలిచింది.
ధాన్యం ఉత్పత్తి పెరిగింది.
గోదాముల నిర్మాణంతో పాటు సబ్సిడీ రుణాలు, రైతు ఆర్థిక వృద్ధి చెందే విధంగా పలు రకాల పైలెట్ ప్రాజెక్టులు, అడుగడుగున కొనుగోలు కేంద్రాలు ఇలా చెప్పుకొంటూ పోతే రైతుల కొరకు మనం చేకూర్చిన లబ్ధి గత పాలకులతో పోల్చితే ఎంతో ఎక్కువే అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు.నర్సంపేటకు మెడికల్ కాలేజ్,జిల్లా ఆసుపత్రితో మెడికల్ హబ్ గా తీర్చిదిద్దబడిందన్నారు.
నూతనంగా మంజూరు తీసుకొచ్చిన అనేక గురుకులాలు నేడు విద్యా రంగంలో ఈ ప్రాంతం ఎంతో మంది పేద బిడ్డల చదువుకు తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు.
ఒక్కప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయి…? ఇప్పుడు ఎలా ఉన్నాయో…? మీరే గమనించి అభివృద్దికై పాటు పడ్డ ప్రభుత్వాలను ఆశీర్వదించాలని ఆయన కోరారు.
మీ అందరి ఆదరాభిమానాలతో ఒకసారి గెలిచిన నేను ఎంతో అభివృద్ధి చేసి చూపాను.మరోసారి మీ ముందుకు వస్తున్న సందర్భంగా పూర్తిస్థాయిలో గులాబీ జెండాకు మద్దతుగా నిలుస్తూ అఖండ నన్ను మెజారిటితో గెలిపించండి అంతుపట్టని అభివృద్ధి చేసి చూపిస్తా అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దివ్యాంగులను,ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు అడ్డ రాజు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!