ముచ్చటగా మూడోసారి కేసీఆరే

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

రోజురోజుకు నియోజకవర్గంలో జోరు అందుకుంటున్న కారు పార్టీ

రానున్న ఎన్నికల్లో పక్కా 90 సీట్లకు పైగానే గెలుస్తున్నాం

అభివృద్ధి కోరుకునే వాళ్ళు బిఆర్ఎస్ కు ఓ వేసి గెలిపించాలి

ఏ రాష్ట్రంలో చేయని అభివృద్ధి పనులు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు.

ఆకర్షితులైన కార్యకర్తలు ఆయా పార్టీల నుండి 200 మంది బిఆర్ఎస్ చేరిక

కాంగ్రెస్ భాజపా మాటలు నమ్మొద్దు
నమ్మితే ఆగమైపోతాం

 

స్టేషన్ ఘనపూర్ (జనగాం) నేటి ధాత్రి

కాంగ్రెస్ బిజెపి పార్టీల కల్లబొల్లి మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని అదొక కప్పల తడక ఉసిరికాయ మూట లాంటిదని అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో చేయ చాతకాక తెలంగాణలో చేస్తానని వస్తున్నారని వారి మాటలకు తెలంగాణ ప్రజలు విని మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ మాటలను తిప్పి కొట్టాలని తిట్టుకొట్టాలని ధ్వజమెత్తారు.

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని జఫర్గడ్ మండల కేంద్రంలోని రామాలయ వద్ద బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశం మాజీ మార్కెట్ చైర్మన్ బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రస్తుత ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి హాజరయ్యారు.

అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎంత గొప్ప అభివృద్ధి పనులు చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వమేనని ఇంత గొప్ప మార్పుకు కారణం కేసీఆర్ పరిపాలన దక్షత అని అన్నారు. ఇవాళ నాకు బాగా గుర్తుంది 2014 కు ముందు ఎన్ని కష్టాలు ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరూ గమనించాలన్నారు. ఈ జఫర్గడ్డ మండలం అభివృద్ధికి దూరంగా ఉందన్నది వాస్తవమని గతంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కునేది వారిని పంట పండక సరైన విద్యుత్తు లేక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేదని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవని, ఎండిన పంటలను పట్టుకొని వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసిన పరిస్థితిలు ఉండేవని, ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్న రాష్ట్రం ఎక్కడ లేదని ఒక రైతు రోడ్డుపైకెక్కి కరెంటు కోసం దరువుల కోసం ధర్నాలు చేసిన దాఖలాలు లేవన్నారు. తెలంగాణ లోనే సాధ్యమైనంత మట్టుకు వ్యవసాయాన్ని పండుగా రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పని చేస్తున్నారని రైతుల యొక్క అప్పులు మాఫీ చేయాలని ఆలోచనతో ఈ పది సంవత్సరాల కాలంలో రెండు సార్లు మాఫీ చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వానిదని, అన్నారు.
15 రోజులలో మొత్తం రైతుల ఖాతాలలో మాఫీ డబ్బులు జమ చేస్తారని, ఎవరు ఆందోళన చెందొద్దని అన్నారు. దేశంలో ఎక్కడైనా ఏక కాలంలో రెండు సార్లు మాఫీ చేసిన చరిత్ర ఉందా అలాంటి రాష్ట్రం ఉందా? ప్రజలు ఆలోచించాలని అన్నారు.
ప్రత్యేకంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకుని రైతులకు రెండు పంటలకు సరిపోయే సాగునీరు, రైతుకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ద్వారా ఎకరానికి పది వేల రూపాయల ఆర్థిక సహాయం, రైతు బీమా, సౌకర్యము కల్పిస్తూ రైతు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే ఒక గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు.
జఫర్గడ్ మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన ఈ రోడ్ వెంట వస్తుంటే ఎటు చూసినా పంట పొలాలతో దర్శనమిస్తుందన్నాయి బ్రహ్మాండంగా ఫైర్లు కనిపిస్తున్నాయి అనేక రకాలైన పంటలు మనకు కనిపిస్తున్నాయి తెలంగాణ సాధించిన ప్రగతి ఇది కాదాని ప్రతిపక్షాన నిలదీశారు.

ఆడబిడ్డలకు అన్ని ప్రభుత్వమే

ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు తల్లిదండ్రులకు ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మని అదే కాకుండా ఒక మంచి పథకాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఆడబిడ్డ గర్భిణీ అయితే పురిటి నొప్పులు వస్తే అమ్మ ఒడి వాహనానికి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి గర్భిణీ స్త్రీ తల్లిదండ్రులు ఎక్కించుకొని ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లి సహజ ప్రసవం చేయించి పుట్టిన బిడ్డను తల్లిదండ్రుల చేతిలో పెట్టి కెసిఆర్ కిట్టు చేతులు పెట్టి ఆడబిడ్డ పుడితే 13000 రూపాయల చెక్కులు చేతిలో పెట్టి మగ పిల్లవాడు అయితే 12,000 చెక్కును చేతులు పెట్టి మళ్లీ అమ్మఒడి వాహనంలో ఎక్కించి క్షేమంగా ఇంటి దగ్గర దించిపోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాదా అన్నారు.

ఆసరాతో ఆదుకుంటున్న ప్రభుత్వం

వృద్ధులకు ఒంటరి మహిళలకు నేతా గీత కార్మికులకు బోదేకాలు, డయాలసిస్, ఆసరా పెన్షన్ 2000 రూపాయలు 4000 దివ్యాంగులకు 4000 రూపాయలు అందజేస్తున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వము కదా పెద్ద మొత్తంలో ఆసరా పెన్షన్లు ఏ రాష్ట్రంలో నైనా ఇస్తున్నారా ప్రశ్నించారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇంత పెద్ద మతంలో పెన్షన్లు ఉన్నాయా బిజెపి పాలిత రాష్ట్రం గుజరాత్ లో ఆసరా పెన్షన్ 600 రూపాయలు మన దగ్గర 2000 దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మంత్రి అధ్యక్షతన గొప్ప సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి

సంక్షేమం జరగాలంటే మళ్లీ బి ఆర్ ఎసే రావాలి

ఇలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే మరొక్కసారి రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితికి ఓటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాకు నమ్మకం ఉంది నాకున్న పరిజ్ఞానముతో చెబుతున్న తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో కచ్చితంగా 90 సీట్లకు పైగానే భారత రాష్ట్ర సమితి గెలుచుకో పోతుంన్నదని ముచ్చటగా మూడోసారి మీ అందరి ఆశీర్వాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రతి పక్షాల మాటలు నమ్మొద్దు మోసపోతాం

సోనియా గాంధీ హైదరాబాద్ కు వచ్చారు తుక్కుగూడలో ఓ బహిరంగ సభలో ఒక గ్యారెంటీ కార్డు ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు 6 హామీలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల ప్రజలు నమ్మి కాంగ్రెస్ కర్ణాటక ప్రజలు ఓటు వేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆ రాష్ట్రాన్ని వదిలేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరుని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కాములకు మారుపేరని ఉసిరికాయల గంప లాంటిదని అదొక కప్పల తడకని, ఉసిరికాయల మూట నుండి వేరే వాళ్ళు ఎట్లా పోతాయో అట్లు కాంగ్రెస్ నాయకులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేస్తే మనం ఆగమైతామని అన్నారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి మాటలు మాత్రం కోటలు తాడుతాయని అవి ఢిల్లీ వరకు ఉంటాయన్నారు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో నాలుగు సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదన్నారు,

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న మళ్లీ మన ప్రభుత్వ రాబోతున్నది మీరు కోరుకున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకునే అవకాశం ఉన్నది నాకు మళ్ళీ పోటీ చేసే అవకాశం కెసిఆర్ వల్ల వచ్చింది ఒకసారి అవకాశం ఇవ్వండి నా పని తీరు మీకు తెలుసు నా నిజాయితీ మీకు తెలుసు అవినీతికి పాల్పడననే విషయం మీకు తెలుసు అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు సేవ చేయడమే నాకు తెలుసు తప్ప ప్రజలను మోసం చేయడం నాకు తెలియదని శ్రీహరి తప్పు చేసి మీకు తలవొంపులు తీసుకురాడని నన్ను ఆశీర్వదించండి నాకు అవకాశం ఇవ్వండి మన నియోజకవర్గాన్ని మన మండలాన్ని అన్ని రంగాల్లో అనేక రకాలుగా అభివృద్ధి చేసుకుందాం ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటామని రోడ్లు లేని గ్రామాలకు రోడ్ల సౌకర్యం చేసుకుందామని ఫర్గెట్ మండలానికి జిల్లా కేంద్రం జనగాం కాబట్టి జఫర్గడ్డ హిమ్మత్ నగర్ తిగారం సముద్రాల మీదుగా నెల్లుట్ల వరకు వెళ్లే విధంగా డబల్ రోడ్డును ఏర్పాటు చేసుకుందాం దానికి సంబంధించిన ప్రతి పాధికను సిద్ధం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని భరోసా ఇచ్చారు.

ఆయా పార్టీల నుండి 200 మంది చేరిక

అనంతరం కడియం శ్రీహరికి నియోజకవర్గ వచ్చిన సందర్భంగా ఆకర్షితులైన సూరార గ్రామస్తులు రాయపర్తి యాకయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు బిజెపి టిడిపి పార్టీ ల నుండి 200 మంది కార్యకర్తలు కడియం శ్రీహరి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బేబీ శ్రీనివాస్ ఎంపీటీసీ రజిత యాకయ్య స్రవంతి మొగిలి కరుణాకర్ రావు బొమ్మినేని పెద్దిరెడ్డి రాజేష్ నాయక్, సుధాకర్ బాబు, అయోధ్య కుల మోహన్రావు అన్నెపు అశోక్ యాదగిరి పెళ్లి స్వామి గండి రమేష్ మొగిలి పాక నరసింగం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ కుల్ల రాజు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *