నీ దూకుడు.. కేసీఆర్ కు సాటి ఎవ్వరు?

టికెట్లు, మేనిఫెస్టో విషయంలోనే కాదు.. ప్రచారంలోనూ కేసీఆర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రాసలు, సూక్తులు, చలోక్తులు, సామెతలు, సాధక బాధకాలు.. ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా సాగుతున్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభలు. నాలుగు రోజులు ఏడు నియోజకవర్గాల్లో పర్యటించిన గులాబీ బాస్ కేసీఆర్.. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ఎండగడుతున్నారు. అలాగే తెలంగాణ రాక ముందు పరిస్థితులను గుర్తు చేస్తూ, విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.

దాదాపు నెల రోజులు అనారోగ్యంతో కేసీఆర్‌ జనానికి కనిపించలేదు. కానీ, పూర్తిగా కోలుకున్నాక ప్రచారం మొదలు పెట్టారు. రోజుకు రెండు సభలు చొప్పున నిర్వహిస్తూ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతున్నారు. నోటిఫికేషన్‌ వచ్చే నాటికే 30 సభలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటికే ఐదారు సభలు నిర్వహించారు.

ఇక కాంగ్రెస్ కేవలం గ్యారంటీ నిర్ణయాలతో అధికారంపై ఆశలు పెంచుకుంది. అయితే తెలంగాణలో ప్రతీ నియోజకవర్గం పైన ఉన్న పట్టు … స్థానిక అంశాలపైన అవగాహన..సామాజిక సమీకరణాలు.. ప్రజా నాడి విషయంలో కేసీఆర్ కు ఉన్న అనుభవం..చాణక్యంలో ప్రత్యర్ధి పార్టీల నేతల సామర్ధ్యం పోటీ పడలేదు. దీంతో, కాంగ్రెస్..బీజేపీ కోసం డిల్లీ నేతలే స్వయంగా తెలంగాణ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. సంక్షేమం..అభివృద్ధి లో సాధించిన ఫలితాలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి.

నిజానికి కేసీఆర్ వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే బలమైన వ్యవస్థ..బీఆర్ఎస్ లో ఉంది. కేటీఆర్, హరీశ్ వంటి ట్రబుల్ షూటర్స్ పాత్ర ఎన్నికల్లో కీలకం. ఇక..రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ కు పోటీగా నిలచే నేత లేరనేది వాస్తవం. మొత్తంగా పాజిటివ్ ఓట్ బ్యాంక్ ను బలంగా నమ్ముకుంటున్న కేసీఆర్..దక్షిణాదిన తొలి సారి హ్యాట్రిక్ విజయం సాధించిన సీఎంగా కొత్త రికార్డు దిశగా అడుగులు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!