నడి కూడ,నేటి ధాత్రి:
మండలం లోని నర్సక్కపల్లె, చౌటుపర్తి,ముస్తాలపల్లి,నడి కూడ,కంఠాత్మకూర్,ధర్మారం,కౌకొండ,సర్వాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పరకాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ లేదని, గతంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అర్ధరాత్రి ఇచ్చేదని,కానీ కేసీఆర్ నాయత్వంలో 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడు,ప్రతి ఒక్కరు స్వషక్తి మీద నిలబడి ఆర్ధికంగా ఎదగాలని కోరుకునే నేత కేసీఆర్ అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ గత పాలనలో ఎక్కడ చూసిన ఆకలి కేకలు, అరాచకలేనని,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందని వృద్దులకు,వితంతులు,దివ్యంగులు ,ఒంటరి మహిళలను సామాజిక బాధ్యతగా ఆదుకోవాలని ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా రూ.2 వెల పెన్షన్ ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో దానిని రూ.5 వేలకు పెంచుతున్నామని అన్నారు. వందల్లో ఉన్న పెన్షన్ వేలల్లోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ రిదని అన్నారు.రైతు బీమా తరహాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కేసీఆర్ బీమా చెల్లిస్తామని,ఆ బీమా ద్వారా రూ.5 లక్షల రూపాయలు అందిస్తామని అన్నారు. ఎన్నికల అనంతరం అసైన్డ్ భూములు కలిగి ఉన్నవారికి భూ హక్కులు కలిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.