ఘనంగా కవ్వంపల్లి జన్మదిన వేడుకలు

వీణవంక,( కరీంనగర్ జిల్లా).

నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, జిల్లా కార్యదర్శి గూటం హరి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ డి సి సి అధ్యక్షులు మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, హరి ప్రసాద్ రెడ్డిలు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
వారు మాట్లాడుతు…. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసిన డాక్టర్ కవ్వంపల్లి రాబోయే రోజులలో ఇంకా అనేక పదవులు చేపట్టాలని ప్రజలకు మరింత సేవలు అందించాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, జిల్లా కార్యదర్శి గూటం హరి ప్రసాద్ రెడ్డి, గంగాడి రాజిరెడ్డి,మాజీ సర్పంచ్ లు గంగాడి తిరుపతి రెడ్డి, ఎక్కడి రఘుపాల్ రెడ్డి,చిన్నాల ఐలయ్య, పంజాల సతీష్, పర్లపెల్లి రమేష్, కర్ర తిరుపతిరెడ్డి,చదువు జైపాల్ రెడ్డి, అడిగోప్పల సంపత్, కట్కూరి ఉపేందర్ రెడ్డి, జున్నుతుల మల్లారెడ్డి, ఎండి రషీద్,జున్నుతుల మధుకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, కంటే మహేందర్, పర్లపల్లి ప్రసాద్, పత్తి సమ్మిరెడ్డి , ఏలేటి శ్రీపాల్ రెడ్డి, రాజు నాగిడి రామ్ రెడ్డి,కర్ర కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!