కత్తిగూడెం రోడ్డు వెంటనే పూర్తి చేయాలి

ఎన్ హెచ్ అర్ సి గ్రామ కన్వీనర్ గంధం కిషోర్

మంగపేట నేటిధాత్రి

ములుగు జిల్లా మంగపేట మండలంలోని కత్తిగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించిన రోడ్డు గురించి ప్రజలు జాతీయ మానవ హక్కుల కమిటీ కత్తిగూడెం ని ఆశ్రహించిగా గ్రామ శాఖ కన్వీనర్ మాట్లాడుతూ బూర్గంపాడు జాతీయ రహదారి రోడ్డు నుండి దేవనగరం గ్రామం వరకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఈ బి టీ రోడ్డు పొడవు 3.10 కిలోమీటర్లు , అంచనా విలువ రూపాయలు 204.50 లక్షలు. 2021 లో మంజూరు అయినా ఈ బిటీ రోడ్డును కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన 2023 వరకు రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉన్న ఇంకా పూర్తి చేయలేదు , పూర్తి చేయాల్సిన గడువు పూర్తయి సంవత్సరం అవుతున్న కాంట్రాక్టర్ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. దీని వలన కత్తిగూడెం గ్రామ ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు మరియు వచ్చి పోయే వాహనాల వల్ల వచ్చే దుమ్ము, ధూళి వలన ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు మరియు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ ఈ రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వలన గత సంవత్సరం కూలీల ట్రాక్టర్ ప్రమాదానికి గురై ఒక వ్యక్తి ఆ ప్రమాదంలో మరణించడం జరిగింది. కావున దీనికి సంబంధింత శాఖ అధికారులు సమస్యపై చొరవ తీసుకొని కత్తిగూడెం గ్రామానికి చెందిన బీటు రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయగలరని కోరుకుంటున్నాను. దీనిపై అధికారులు పట్టించుకోకుంటే కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు మండల కమిటీ ద్వారా పిర్యాదు చేస్తాం ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ అర్ సి గ్రామ కో- కన్వీనర్ మండల కిషోర్ , కత్తిగూడెం గ్రామ యువకులు శానపూరి సల్మాన్, దామర్ల మురళి మరియు బేతమల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *