
జాతీయ బీసీ సంఘం జిల్లా ఇంచార్జ్ విజయగిరి సమ్మయ్య.
మాలహర్ రావు, నేటిధాత్రి :
భూపాలపల్లి జిల్లాకు తొలిసారిగా పర్యటన పై వచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్, వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జి కత్తి వెంకటస్వామి గౌడ్ ను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జాతీయ బీసీ సంఘం జిల్లా ఇంచార్జ్ విజయగిరి సమ్మయ్య మరియాపూర్వంగా కలిసి
శాలవతో సన్మానించిన అనంతరం వారితో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీ కుల గణగ ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలని కోరారు. ప్రభుత్వం స్థానిక సంస్థ ఎలక్షన్ లో 42 శాతం రిజర్వేషన్ ను కల్పించాలని. బీసీ కులాలకార్పొరేషన్ ఏర్పాటు చేయ్యాలని పాలకవర్గన్ని నియమించాలి ప్రతి పాలకవర్గ కార్పోరేషన్కుకు ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు కేటాయించాలని. ప్రభుత్వం ఇచ్చే నామినేట్ పోస్టులలో బడుగు బలహీనవర్గాల బీసీలను గుర్తించి ఎంపిక చేయ్యాలని ఎమ్మెల్యేగా అవకాశం లేని బీసీ కుల సభ్యులను కనీసం ఎమ్మెల్సీ అవకాశనైనా కల్పించి రాజ్యసభకు ఎంపిక చెయ్యాలని బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం వారు స్పందించి బీసీలకు తగిన న్యాయం జరిగేలా కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా
వెంకటస్వామి గరకి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.