
President Kalvakuntla Taraka Rama Rao (KTR)
ఘనంగా కేటీర్ జన్మదిన వేడుకలు..
ఏనుమాముల, నేటిధాత్రి
మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) 49వ జన్మదిన వేడుకలను గురువారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతిరి రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏల్లవుల కుమార్ యాదవ్ కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. కేతిరి రాజశేఖర్ మాట్లాడుతూ 18నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ,ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండ్రాతి భాస్కర్ పత్రి సుభాష్ ఉద్యమకారుడు హస్తం యాదగిరి పసులాది మల్లయ్య కేతిరి సమ్మక్క రంగరాజు విజయ ఆటో యూనియన్ నాయకుడు ఎండి సలీం భామల పెళ్లి కిరణ్ పున్నం ప్రభాకర్ వీరాచారి గండ్రాతి నవీన్ సతీష్ కొత్తపెళ్లి సునీల్ ఆడేపు అశోక్ బొల్లె సాంబయ్య గుమలాపురం హైమావతి ఎండి గౌస్య కుడికాల పద్మ ఈరెల్లి రజిత, రంగు లక్ష్మి, ఎండి జావిద్, ఎండి ఫిరోజ్, గంధం కిషోర్, పస్తం రవి ప్రసాద్ శ్రీనివాస్ దామెర లెనిన్ తదితరులు పాల్గొనడం జరిగింది