కాటారం ఐటిఐ కాలేజ్ సమస్యలు పరిష్కరించాలి
విద్యార్థులు కూర్చోవడానికి కనీసం బెంచిలి లేనటువంటి దుస్థితి
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు
బొడ్డు స్మరణ్ కుమ్మరి రాజు
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఉన్నటువంటి ఐటిఐ కాలేజీనీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది కనీసం బెంచీల సౌకర్యం లేనటువంటి పరిస్థితి అక్కడ చదువుతున్న విద్యార్థులు సుమారుగా 80 మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ 20 మందికి కూర్చోవడానికి బెంచీలు లేలి పరిస్థితి కనీసం లైట్లు లేవు కనీస మౌలిక వసతులు లేవు అని భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐటిఐ కాలేజీ విద్యార్థులతో నిరసన తెలుపడం జరిగింది వెంటనే ఐటిఐ కాలేజ్ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే కాలంలో ఐటిఐ కాలేజ్ విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటిఐ కాలేజ్ కమిటీ సభ్యులు వికాస్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు …