వనపర్తి నేటిదాత్రి:
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 14 నుండి డిసెంబర్ 12 వరకు కార్తక మహోత్సవాలు జరుగుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ ఒక ప్రకటనలో తెలిపారు24 న తులసి మాత కృష్ణ వరలక్ష్మి కళ్యాణం 27 న శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా జరుగుతాయని 500 రూపాయలు చెల్లించి రసీదు పొందాలని ఆయన కోరారు పవిత్రమైన కార్తీక మాసం నందు శ్రీవారి ఆలయం ముందు అఖండ దీపం ఉంటుందని డిసెంబర్ 12న సాయంత్రం ఆకాశదీపం వెలిగించబడుతుందని చైర్మన్ తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామికి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు
14 నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మహోత్సవములు
