ఖమ్మం,నేటి ధాత్రి:
నేటి సమాజంలో ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి శారీర దృఢత్వంతో పాటు ఆపదలో తమని తాము రక్షించుకోవడానికి కరాటే నేర్చుకోవడం అత్యవసరమని ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు 45వ డివిజన్ కార్ఫోరేటర్ బుడిగెం శ్రీనివాస్, సీనియర్ డాక్టర్ సామినేని సీతయ్య, పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు, కార్యదర్శి కొండమీద వెంకట్, కార్మిక నేత మంద వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం రోజున స్థానిక ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో గత 50 రోజులుగా ఝాన్సీ లక్ష్మీబాయి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సెల్ఫ్ డిఫెన్స్ పర్ గల్స్ పేరుతో ఉచిత కరాటే శిక్షణ సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన చిన్నారులు చేసిన పలు సాహసోపేత విన్యాసాలు ముగ్గురు పిల్లలు పడుకుంటే వారిపై నుండి బైక్ పై ఇద్దరు ఉండి బైక్ పోనియడం ఒళ్ళు గగురుపొడిందని విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆడపిల్లపై దాడుల జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, పిల్లలను ఎత్తుకెళ్లె టప్పుడు ఎలా తిప్పికొట్టాలి, యాసిడ్ దాడుల జరిగినప్పుడు ఏంచేయాలి అనే పలు అంశాలపై కరాటే కోచ్ నేర్పడం జరిగిందన్నారు. అనంతరం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సెల్ఫ్ డిఫెన్స్ పర్ గల్స్ ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, కరాటే విద్య నేర్చుకొవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవన్నారు. కరాటే నెర్చుకునే వారిలో అబ్బాయిలతో పోలిస్తే చాలా మంది అమ్మాయిలు శారీరకంగా బలహీనంగా ఉంటారని, అందువల్ల అమ్మాయిలకు కరాటే విద్య ఉపయోగపడుతుందని తెలిపారు. కరాటే ప్రాక్టీస్ చేసే వారు శారీరకంగా మెరుగుపడతారని ఫలితంగా మానసికంగా కూడా దృఢంగా తయారవుతారని అన్నారు. కార్యక్రమం లో కారాటే మాస్టర్స్ యం. బాబు, పాషా, షకీరా లతో పాటుగా
వెంకట్, సుదర్శన్, నిరంజన్, శ్రీనివాస, దుర్గాప్రసాద్, అంబాల వెంకటేశ్వర్లు, విజయకుమార్ మరియు
విద్యార్థుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.