SI Shows Humanity to Elderly
మానవత్వం చాటుకున్న కరకగూడెం ఎస్సై
పి.వి నాగేశ్వరరావు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వట్టం వారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని నివాసం ఉంటున్న ఓర్సు మల్లయ్య75 సంవత్సరాలు గత కొన్ని నెలలుగా భార్య చనిపోవడంతో మతిస్థితి లేకుండా తిరగడంతో గురువారం స్థానిక ఎస్సై పివి నాగేశ్వరరావు చేరదీసి అతనికి కటింగ్ సేవింగ్ చేయించి నూతన దుస్తులను మరియు ఆహారం అందించి మానవత్వం చాటుకున్న ఎస్సై నాగేశ్వరరావు వృద్ధుడిపై చూపించిన ప్రేమకి పలువురు కొనియాడారు.
