కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
కరకగూడెం మండలంలోని గొల్లగూడెం హజరత్ ఆలీబాబా జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం,ములుగు రెండు జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను కరకగూడెం ఎస్ఐ రాజేందర్ చేతుల మీదుగా ప్రారంభించి,క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ….క్రీడల వలన శారీరిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్గించి,క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాన్ని పెంపొందిస్తుందని అన్నారు.క్రీడాకారులతో పాటు చదువులలో ముందుండాలని తెలిపారు.క్రీడాకారులు,యువత ఏటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు షారుఖ్,శ్రీను, మోయిన్,గ్రామస్థులు సత్యం,నగేష్,గ్రామ యువత,క్రీడాకారులు పాల్గొన్నారు.