మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్రనాయక్ పాల్గొన్నారు,
కంఠమహేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు,
స్వామి వారి ఆశీస్సులతో కృపా కటాక్షాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు, అనంతరం గౌడ సంఘ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,గ్రామ పెద్ద గౌడ్ రాంపల్లి నాగన్న గౌడ్,సారకోల గౌడ్ ఈరగని ఉపేందర్ గౌడ్, గ్రామ పెద్దలు దోమల అశోక్,సుధా గాని లాలు, రాంపల్లి వీరాంజి గ్రామ గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.