నేటిధాత్రి వరంగల్
గ్రేటర్ వరంగల్ 11వ డివిజన్ లోని పోతనవాడకు చెందిన మొహమద్ సంజర్ పాషా ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుoటున్నాడు. గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని స్థానిక ప్రతినిధి మెడకట్ల సుకుమార్, కందుల సత్యనారాయణ ఫౌండేషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. ఫౌండేషన్ సభ్యులు వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి ఆర్థిక పరిస్థితిని గమనించి ఫౌండేషన్ వంతు సాయంగా నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందచేయడం జరిగింది. గతంలో కుడా కందుల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు మరియు ఎంతో మందికి చేయూతను ఇచ్చిన విషయం తెలిసిందే. ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం నిజమైన లబ్దిదారులను, అర్హులైన నిరుపేదలను ఆదుకోవాలని అనే సంకల్పంతో కీర్తిశేషులు కందుల సత్యనారాయణ కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ నాగపూరి పద్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుల్గం సదానందం పటేల్, సిటీ మైనారిటీ జెనరల్ సెక్రటరీ సయ్యద్ అజ్గర్ అలీ, కందుల ఫౌండేషన్ సభ్యులు కార్తీక్ సింగ్, అల్తాఫ్, సీనియర్ నాయకులు ముప్పు సతీష్, గడ్డం రమేష్ , కొప్పుల సునీల్, తోట సుమంత్,సిలువేరు సంజయ్ తదితరులు పాలుగోన్నారు