అంతరించిపోతున్న కళకు జీవం పోస్తున్న కనగర్తి గ్రామ కళాకారులు

గ్రామంలో మూడు రోజులుగా చిరుతల మహాభారత నాటక ప్రదర్శన

జిల్లా నలుమూలల నుంచి కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన కళాభిమానులు

కార్యక్రమం ఆద్యంతం కిక్కిరిసిన మైదానంతో జననీ రాజనాల అందుకున్న కళాకారులు

ఓదెల(పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం.. ఒకనాడు పల్లెల్లో అలసి సొలసిన అక్కాచెల్లెళ్లు సాయంత్రం సావటికాడ ఆడే చిందు యక్షగానాలు, చిరుతల మహాభారత రామాయణ కార్యక్రమాలు, కోలాటం, భజనలు ,హరికథలు మరియు బుర్రకథలు చూసి వారి శారీరక కష్టాన్ని మరిచిపోయేవారు. కానీ నవీన నాగరికత పేరుతో ఈ రంగుల ప్రపంచంలో టీవీలు మరియు సినిమాల వచ్చి ప్రాచీన కళలు మరుగున పడిపోయి ఆ కళలను నమ్ముకున్న కళాకారులు వీధిపాలయ్యారు. కానీ ఇందుకు భిన్నంగా పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామ కళాకారులు కళలకు చావు లేదని నిరూపించడం జరుగుతుంది. పెద్దపెల్లి డివిజన్లోని మొట్టమొదటిసారిగా 1956లో శ్రీ చిరుతల రామాయణం మహాభారత ప్రదర్శన ఇచ్చి ఆవురా అనిపించారు. అప్పటి నుంచి ఈ కలను కాపాడుకుంటూ నేటి తరం వరకు అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా దాదాపుగా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి చిరుతల రామాయణ మహాభారత పట్టాభిషేకం నిర్వహిస్తూ గ్రామంలో ఇప్పుడున్న తరానికి మన ఇతిహాసాలను సారాన్ని బోధించడం జరుగుతుంది. దీనిలో భాగంగా గత మూడు రోజులుగా గ్రామంలో శ్రీ చిరుతల మహాభారత పట్టాభిషేక కార్యక్రమాన్ని అత్యంత ఆధునిక హక్కులతో ప్రాచీన పౌరానిక సినిమాలను కళ్ళకు కట్టినట్లు చూపించే విధంగా అందమైన కాస్ట్యూమ్స్ తో చూపరులను అలరించడం జరిగింది. మూడు రోజులుగా జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి మరియు మండలాల నుండి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన కళాకారులు కళాభిమానులతో మైదానం కిక్కిరిసిపోయింది మహాభారతంలోని వివిధ ఘట్టాలను ప్రదర్శించిన కళాకారుల కళా నైపుణ్యాలను ప్రేక్షకులు ఎంతో ప్రశంసించడం జరిగింది. పోద్దస్తమానం టీవీకి అతుక్కుపోయే ఈ కాలంలో కూడా ప్రాచీన కళను కాపాడడం చాలా గొప్ప విషయమని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పిటిసి సభ్యులు గోపగొని సారయ్య గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ప్రధాన పాత్రలు పోషించిన రావుల స్వామి గౌడ్ ,రావుల సదానంద గౌడ్ , రావుల రాజయ్య గౌడ్ ,కన్న సురేందర్ గౌడ్, చేరుకుతోట నాగేష్, ఎగొలపు విజయ్ గౌడ్ గుండారం రాజు, తోట సారయ్య గౌడ్ ,కన్న నరేందర్ గౌడ్ మరియు శిక్షకులు ఆరేల్లి వెంకటయ్య గౌడ్ , కొడం శ్రీనివాస్ లను ఘనంగా సత్కరించి అభినందించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!