కామారెడ్డి జిల్లా /పిట్లం నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా డిసిహెచ్ఎస్ అధికారిని విజయలక్ష్మి తనిఖీ నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సి హెచ్ సి 30 పడకల ఆసుపత్రి నిర్మాణపు పనులు ఎంతవరకు వచ్చాయి ఇంకా ఎంత మిగిలి ఉన్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఈరోజు జుక్కల్ నియోజకవర్గం లోని పలు మండలాల ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ నిర్వహించడం జరిగిందని అలాగే ఆసుపత్రులకు సంబంధించి కొన్ని సమస్యలు కూడా తన దృష్టికి వచ్చాయని వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిట్లం సామాజిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు