
పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణ లక్ష్మి పథకం..
#ఆర్ధిక భారంలో ఉన్న సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు…
#ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు..
కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే నాయిని.
హన్మకొండ, నేటిధాత్రి:
ప్రజా ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.శనివారం రోజున కాజీపేట మండలానికి సంబంధించిన 42 మంది లబ్ధిదారులకు రూ. 42,04,842 ల కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పేద ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తుందని తెలిపారు.కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులు ఎటువంటి దళారులకు నమ్మవద్దని తెలిపారు.పెళ్లి చేసిన ఇంటికి ఆర్ధిక సహాయం అందించాలని ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు .
ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ ల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.