పెళ్ళైనవెంటనే లబ్ధిదారులకు చెక్కులు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుంది
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పరకాల పట్టణం,పరకాల, నడికుడా,దామెర,ఆత్మకూరు మండలాల పరిధిలోని 69 మంది లబ్ధిదారులకు 69 లక్షల 8 వేల 4 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్బంగా కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం పేదలకు వరమని రాబోయే రోజులలో పెళ్లయిన వెంటనే లక్ష 116 రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన పనిచేస్తుందని,గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు చెక్కులను ఇవ్వడం జరుగుతుందని వెంట వెంటనే ఆర్డీవోలు తాసిల్దార్లు అందించేలా కృషి చేస్తున్నారని ఇకనుండి గతంలో లాగా లబ్ధిదారులు నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పెళ్లయిన వెంటనే అందించేలా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని పెళ్లికి ముందే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని అందుకు అధికారులు సహకరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ప్రాజాప్రతినిధులు,లబ్ధిదారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.