కళ్యాణ లక్ష్మి ,షాధి ముబారక్ చెక్కులు అందించాలి.

వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అధ్యక్షతన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కుల మతాలకు, వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందరికీ మంజూరు చేయాలని గతంలో వివాహము జరిగిన వధువు తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ల కొరకు దరఖాస్తు చేసుకున్న కొద్ది నెలలకే సంబంధించిన అధికారులు గతంలో చెక్కులను అందించారని ,కానీ 8 నెలల క్రితం జరిగినటువంటి వివాహంల వదువు తల్లిదండ్రులు కళ్యాణ లక్ష్మీ,షాధి ముబారక్ ల కోసం దరఖాస్తు చేసుకున్న నేటి వరకు వారికు కూడా చెక్కులు అందించక పోవడం బాధాకరమన్నారు. తక్షణమే సంబంధించిన అధికారులు దరఖాస్తు చేసుకున్న వదువు తల్లులఁదరికి చెక్కులను అందించాలని డిమాండ్ చేశారు .ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యాదర్శి గుర్రపు రాజేందర్ పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!