చందుర్తి, నేటిధాత్రి:
శ్రీరామనవమి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల, కట్ట లింగంపేట లింగంపేట జోగాపూర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయంలో కళ్యాణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి ఆధ్వర్యంలో కన్నుల పండగగా శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గ్రామంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం హోమం , అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం గ్రామ పురవీధుల గుండా శోభాయాత్ర కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని కార్యక్రమానికి గ్రామ ప్రజలు మండల చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆ శ్రీరామచంద్రుని కోరారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాసును ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మరియు శ్రీ సీతారామ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు