Charity Support to Deceased Family in Kalwakurthy
కల్వకుర్తి మున్సిపాలిటీ…
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ – ఉప్పల వెంకటేష్ సహకారంతో మృతుడి కుటుంబాలకు ఆర్థిక సహాయం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి:
కల్వకుర్తి మున్సిపాలిటీకి చెందిన ఆర్యవైశ్య అల్లంపల్లి శ్రీను అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని ఆర్య వైశ్య సంఘం నాయకుల ద్వారా తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు & మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారి పిల్లల చదువుకు సహాయం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం కల్వకుర్తి మండలం అధ్యక్షులు గంధం ప్రసాద్, ఆర్య వైశ్య సంఘం నాయకుడు దాచపల్లి శ్రీనివాసులు, ఉప్పల వెంకటేష్ సైన్యం దారమోని గణేష్ , ఐలా శేఖర్ గౌడ్, ఆర్య వైశ్య సంఘం నాయకులు పోల నరేష్, ఆకారపుశివ తదితరులు పాల్గొన్నారు.
