
మంచిర్యాల, నేటి ధాత్రి:
శనివారం రోజున హైదరాబాద్ శేర్లింగంపల్లిలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు స్వర్గీయులు కాలువ నరసన్న యాదవ్ ఐదవ వర్ధంతి వేడుకలని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ బేరి రామచందర్ యాదవ్ లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ కాలువ నరసన్న యాదవ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,యాదవ ముద్దుబిడ్డ, అన్నా అంటే నేనున్నా అంటూ వచ్చి ఆపదలో ఆదుకునే గొప్ప మనసున్న మనిషి కాలువ నరసన్న యాదవ్ తెలంగాణ రాష్ట్ర గొల్ల కురుమల అభ్యున్నతి కోసం ఊపిరి ఉన్నంతవరకు పని చేసి ఎన్నో సహకార సంఘాలు స్థాపించి ఆ సంఘాలన్నింటినీ ఐక్యం చేసిన గొప్ప మహానుభావుడు అని ఈరోజు కరీంనగర్ లో స్థాపించిన అఖిల భారత యాదవ సంఘం అధ్యక్షులు మాజీ సర్పంచ్ గుండ్ర రాజన్న యాదవ్ కి కరీంనగర్ జిల్లా గొల్ల కురుమల అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ఆవుల రాజన్న యాదవ్, రమేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.