
"Kaloji Jayanti Celebrated at Tahsildar Office"
తహసిల్దార్ కార్యాలయంలో ఘనంగా కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు
మెదక్ జిల్లా, రామాయంపేట, సెప్టెంబర్ 9 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం ప్రముఖ కవి,స్వాతంత్ర్య సమరయోధుడు,ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దారు రజిని కుమారి మాట్లాడుతూ, “కాళోజి గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష పాత్ర పోషించారు. ఆయన రచనలు సామాజిక చైతన్యానికి మార్గదర్శకాలు. ఆయన స్ఫూర్తితో మనమంతా తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలి” అని పేర్కొన్నారు.
అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం వేడినీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నవీన్. మండల ఆర్ఐ గౌస్ మయినుద్దీన్, రూరల్ ఆర్ఐ గోపి, సుష్మ. రోజా. చంద్రకళ సౌమ్య. మండల రెవెన్యూ సిబ్బంది పద్మ.తదితరులు పాల్గొన్నారు.