
"Kaloji Jayanthi Celebrated in Siricilla"
సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కాళోజి జయంతి వేడుకలు
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈ రోజు సాహితీ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాకవి కాళోజి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి అందులో భాగంగా సిరిసిల్ల సాహితీ సమితి గౌరవ అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ..
తెలంగాణ యాస భాష మన కాళోజీ అని, నిజాం నిరంకుశ పాలనకు ఎదురు తిరిగిన యోధుడని, కలం పట్టి ఖడ్గంగా మార్చిన మన కాళోజీ తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని రచించినటువంటి వ్యక్తి అని అన్నారు. ఈ సందర్భంగా సాహితీ సమితి ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాళోజి పై కవితను గానం చేశారు నిజాం తూటాలకు, కలం పట్టిన వీరుడని పొగిడారు. అలాగే బుర దేవానందం మాట్లాడుతూ కాళోజీ పై కవితను గానం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోడం నారాయణ, దొంత దేవదాస్, అంకారపు రవి,ఎం.డి ఆఫీజ్, తదితర కవులు రచయితలు పాల్గొన్నారు.