
TRS Leaders Join Congress in Mahadevpur
కాంగ్రెస్ లోకి కాలేశ్వరం టిఆర్ఎస్ నాయకులు
* పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఐటీ మంత్రి వర్యుల
మహాదేవపూర్ అక్టోబర్ 14 (నేటి ధాత్రి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం టిఆర్ఎస్ నాయకులను మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలోని కాలేశ్వరం టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు నాగునూరి రమేష్ గౌడ్ ను మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు లేతగారి రాజబాబు ఆధ్వర్యంలో మంథని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఐటి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంథని క్యాంపు కార్యాలయ సిబ్బంది, కాలేశ్వరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.