సిరిసిల్ల పట్టణ నూతన కమిషనర్ ను కాదిర్ పాషా మర్యాదపూర్వకంగా కలిసిన మానవ హక్కుల సంఘం
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)
ఈ రోజు సిరిసిల్ల పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ కాదిర్ పాషా రాజన్న సిరిసిల్ల జిల్లా మానవ హక్కుల సంఘం మరియు యాంటీ కరెప్షన్ జిల్లా ఛైర్మెన్ గజ్జె శివరాం మరియు గౌరవ సభ్యులు అందరూ మర్యాద పూర్వకంగా కలిసి,బొకే ఇచ్చి శాలువ తో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మీ అసోసియేషన్ తరుపున మీరు చేసే కార్యక్రమాలలో తగిన సహాయ సహకారాలు అందించాలని అలాగే ప్రతి ఒక్క కార్యక్రమానికి మున్సిపల్ ను భాగస్వామ్యం చేసుకొని ముందుకు సాగాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా ఛైర్మెన్ గుజ్జె శివరాం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇవ్వడం లో జాప్యం జరుగుతుంది కాబట్టి తక్షణంగా స్పందించి జాప్యం కాకుండా లబ్ధి దారులకు ఇసుక ను అందించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి పంజా బాలరాజు,ప్రధాన కార్యదర్శి రాచకొండ మహేశ్,గొల్లపెల్లి మహిపాల్,కొడం బాలకిషన్,సజ్జనం శ్యామ్ సుందర్,కడార్ల మురళీ,మిద్దె ప్రకాశ్,జింక శరత్, నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.