కడియం కావ్య గెలుపు ఖాయం

ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరకాల కాంగ్రెస్ శ్రేణులు

పరకాల నేటిధాత్రి
వరంగల్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.శనివారం రోజున పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాలమేరకు స్థానిక పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 47వ బూత్ అధ్యక్షుడు పసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణంలో గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పాంచ్ న్యాయ సూత్రాలు ఓటర్లకు అవగాహన చేస్తూ 47వ బూత్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ సందర్బంగా పట్టణంలో 18,19వ వార్డుల ఇంచార్జి పావశెట్టి సునీల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో ప్రజలలో జోష్ పెరిగిందని టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతిని ప్రజలు గమనించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తెలిపారు అదేవిధంగా ఉత్సాహంలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించు కొవాలని హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.కాంగ్రెస్‌ పార్టీ ఐదు హామీల గురించి వివరించారు.రెండు లక్షల రైతు రుణమాఫీ,ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ.8,333, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రూ.400,ఐదు లక్షలతో పేదలకు గహ నిర్మాణం, వద్ధులకు పెన్షన్‌ రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్య తదితర పథకాలను వివరించారు.మే 13న నిర్వహించబోయే సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు నిమగ్నమయ్యారు కేంద్రంలో బిజెపి మతతత్వ పార్టీతో దేశ ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటేరు కుమార్,ఒంటేరు చరణ్ రాజ్, ఒంటేరు రమేష్,మచ్చ సందీప్,గోపి,సమంత్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!