
ఆత్మీయ సమావేశాలతో అందరికి ఆప్తుడుగా మారుతున్న కడియం
15 ఏళ్ల నుండి ప్రజలకు దూరముగా ఉన్న వారి హృదయాలలో చెదరని అభిమానం
అధికారంలో ఉన్న లేకున్నా నియోజకవర్గంలో కడియం పై క్రేజీ తగ్గలేదు
స్టేషన్ ఘనాపూర్ టిక్కెట్టు కడియంకి ఇవ్వడమే ప్రతిపక్షాలకు చెక్ పడినట్టే
కడియం శ్రీహరి అంటేనే అభివృద్ధికి నాంది
అంటున్న ప్రజలు
చెక్కుచెదరని అభిమానం నీతి నిజాయితీలకు నిలయం
స్టేషన్ ఘనపూర్ (జనగాం) నేటిధాత్రి
స్టేషన్ ఘనపూర్ అంటేనే 15 సంవత్సరాల క్రితం కడియం శ్రీహరి నియోజకవర్గం అని చెప్పుకునే స్థాయి వరకు తీసుకువెళ్లి మారుమూల గ్రామానికి బిటీ రోడ్లు వాటర్ ట్యాంకులు అంతర్గత సీసీ రోడ్లు నిర్మిస్తూ కులానికి కమ్యూనిటీ హాల్ మహిళా సంఘాలకు కమ్యూనిటీ గాలు అందించి నియోజకవర్గ అభివృద్ధిని స్థానం నిలిపిన నాయకుడిగా రైతుకి పెట్టిన పేరుగా అభివృద్ధి ప్రదాతగా నియోజవర్గంలో పిలువబడుతున్న ఏకైక నాయకుడు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అనే చెప్పాలి
గ్రామ గ్రామాన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల మనసుల్లో కెసిఆర్ పనితనాన్ని సంక్షేమ పథకాలను స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ గడ్డమీద గులాబీ జెండా ఎగరడం కోసం అహర్నిశలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు. ఏ గ్రామానికి వెళ్లిన గ్రామ పరిస్థితులు ఏంటి గెలువగానే చేయవలసిన అవసరతలు ఏంటి అని ఇది పునికి పుచ్చుకొని అధికారంలోనికి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి స్థాయిలో చేపడతానని భరోసా ఇస్తు పార్టీలకతీతంగా ప్రజలను మమేకం చేస్తూ పార్టీ గెలుపు కోసం కారు గుర్తుకే మన ఓటు అంటూ
ప్రతి నోట పలికిస్తూ తీసుకు వెళ్తున్నాడు.
గ్రామాలకు గ్రామాలే పూర్తిస్థాయి మద్దతుని తెలియజేస్తాం సార్ మీ గెలుపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి కావడం కోసం స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో మిమ్మల్ని మేము గెలిపించుకుంటామంటూ నడుం కడుతున్న యువత, మహిళలు, ప్రజలు, పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు.
ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ వస్తుందని
కడియం కు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చుడే గెలుపుకు నాంది అని అంటున్న నియోజకవర్గ ప్రజలు
టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో అందరివాడు అవుతున్న కడియం
రైతును రాజును చేయండమే కేసిఆర్ లక్ష్యం
దేశములో ఎక్కడ లేని విధంగా ఎక్కడ చేయని విధంగా రెండుసార్లు రైతుల రుణాలు మాఫీ చేయడం ఘనత కేసిఆర్ కి దక్కుతుందని ఇప్పుడు రుణాలను మాఫీ చేస్తున్న ఇప్పటికీ కొంత మందికి రుణాలు మాఫీ అయ్యాయని కొంతమందికి ఇంకా రుణాలు పడలేదని ఎవరు కూడా ఆందోళన పడొద్దని ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుందని అన్నారు. దేశం లో ఎక్కడ లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమని దానికి తోడు సాగునీరు అందించడం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రెండు పంటలకు సరిపడా సాగునీ అందిస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు.
పెట్టు పడి సహాయం రైతులకు ప్రమాద శాతం మరణించిన సహజ మరణమైన ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తూ రైతును రాజును చేయాలని ఉద్దేశంతో కెసిఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు తెలంగాణలో పంట దిగుబడి పెరిగింది.
పట్టణానికి వలస వెళ్ళిన ప్రజలు వారి యొక్క సొంత గ్రామాలకు తిరిగి రావడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న రైతు సంక్షేమ పథకాలను చూసి దేశవ్యాప్తంగా మా రాష్ట్రంలో కావాలని అడుగుతున్నారన్నారు.
పేదింటి బిడ్డ పెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మేనమామ
పేదింటి బిడ్డ పెళ్లికి తానే మేనమామ లక్ష 16 రూపాయలు కానుక పెడుతు ఆ బిడ్డ కపంజాలిస్తే 102లో ఇంటికి వచ్చి గర్భిణీ స్త్రీని తీసుకుని అన్ని పరీక్షలు చేయించి మందులు ఇప్పించి తీసుకొని వచ్చి ఇంటిదగ్గర దింపేస్తున్న కార్యక్రమం అదే కాకుండా సుఖమైన ప్రసవం జరిగించి తల్లి బిడ్డను కేసీఆర్ కిట్టి ఇచ్చి మగ బిడ్డ పుడితే 12,000 రూపాయలు ఆడబిడ్డ పుడితే 13000 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి సాగనంపుతు ప్రభుత్వ వాహనంలో తన సొంత ఇంటి దగ్గరనే దింపుతున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అన్నారు ఇలాంటి విప్లవత్మకమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.
కొన్ని పార్టీలను నమ్మొద్దు
ఎన్నిల కు వచ్చే బాజాప కాంగ్రెస్ పార్టీ లను నిలదీయండి గత 70 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు గుర్తుకురాలేదు రైతులకు ఉచిత కరెంటు రైతు బీమా రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఎలా ఇస్తావ్ అంటూ నిలదీయాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర రైతులకు ఎలాంటి సంక్షేమ పథకాలు యువ చాతగాక ప్యాకేజీల పథకాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు తెలంగాణలో ప్రకటించిన ఈ ఆరు పథకాలను ప్రవేశపెట్టలేదని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఒక ఉసిరికాయ మూటల లాంటిదని కాంగ్రెస్ పార్టీ నాయకులలో వారికి వారికే సమాధానం లేక ఒకరు ఒకరు ఎత్తుపరుచుకుంటున్నారు తప్ప ప్రజలకు చేద్దామన్న ఉద్దేశం లేదన్నారు. భాజాపాకు తెలంగాణలో నాలుగు సీట్ల కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భాజాప నాయకులు ఆగడం లేదన్నారు కేంద్రంలో మేమే ఉన్నామంటూ ప్రజలు పలుకుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై విషయంగాకుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని అఖిల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానాన్ని చాటిన కార్యకర్తలు
స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని తాటికొండ గ్రామంలో వైస్ యంపిపి సుధీర్ రెడ్డి, అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి కడియం శ్రీహరి పాల్గొని వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్టతకు భూమి పూజ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర
వర్షాన్ని సైతం లెక్కచేయని అభిమానంతో తాటికొండ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి చల్లా ఉమాదేవి ఎంపిటిసి బొల్లం వెంకటస్వామి గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నం శ్రీనివాస్ అక్కనపల్లి బాలరాజు రాపోలు మధుసూదన్ రెడ్డి, ఐలోని సుధాకర్ గౌడ్ మేకల మల్లేష్ చైర్మన్ పాస్ డైరెక్టర్ వక్కల లక్ష్మి, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ఘనంగా చిల్పూర్ మండల ఆత్మీయ సమావేశం
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ కేంద్రంలోని చిల్పూర్ లో గ్రామంలో సర్పంచి ఉద్ద మారి రాజకుమార్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమావేశం నిర్వహించారు ముఖ్యఅతిథిగా స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి పాల్గొని గుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా మంత్రి గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బి ఆర్ ఎస్ ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యాను ఈ స్థానం మీరందరు పెట్టిన రాజకీయ బిక్ష గతంలో ఈ గ్రామ పంచాయతీకి పరిదిలో ఉన్న పాఠశాల ను హైస్కూల్ గా చేసుకున్నాము పేరు తప్పు పడడంతో ఈ జీ ఎస్ నిధులు చిల్పూర్ పేరు తప్పు పడ్డందుకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నిధులు వచ్చే విధంగా చేశానని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదమున్నంతవరకు ఈ గ్రామము మండలం అభివృద్ధి చెందుతుందన్నారు.
మీ అందరి సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో బుగులు వెంకటేశ్వర స్వామి గుట్ట దేవస్థానానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఆలయనాభివృద్ధి చేస్తానన్నారు.
నియోజకవర్గంలో పెద్ద ఆలయం ఎక్కడ లేదను మంత్రి దయాకర్ రావు లా వల్మిడి గ్రామంలో నిర్మించిన ఆలయం మాదిరిగా చిల్పూర్ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
గెలిచిన ఆరు నెలలు డబల్ బిటి రోడ్డు ను చేస్తానని మండల కేంద్రంలో కావలసిన మండల కార్యాలయాలని ఎంపీడీవో తహసిల్దార్ అగ్రికల్చర్ కార్యాలయం పోలీస్ స్టేషన్ ఆసుపత్రి ఒకే కాంప్లెక్స్ లో ఉండే మాదిరిగా కాంప్లెక్స్ కడతానని హామీ ఇచ్చారు. ఈరోజు ఈ సమావేశం నిర్వహించిన ఉద్దేశం ప్రజలతో కూర్చొని ఒక ఎజెండాతో పనిచేయాలని పార్టీ కోసం గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసే విధంగా దిశా నిర్దేశం చేసుకొని మాట్లాడుకునే విధంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసేమన్నారు.
తొమ్మిది సంవత్సరాల లో తెలంగాణ ఎట్లా ఉండే ఈ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇంట్లో ఉన్నదో ప్రజలే ఆలోచించాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందని ఇప్పుడు ఏ గ్రామం చూసిన పచ్చని పంటలతో కళకళలాడుతుందని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతు రుణమాఫీలు రెండు దర్పాలుగా మాపి చేయడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు పచ్చగా ఉండాలని
వారి సంక్షేమ పథకాల పెట్టి 24 కరెంట్ ఇచ్చిన ఏకైక పార్టీ బిఆర్ఎస్
కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అంటే తెలంగాణ వ్యతిరేకం కాంగ్రెస్ అంటే తెలంగాణ నిధులను జారిబల్లించిన చరిత్ర కలిగిందని ఉండలాగే మండల ప్రజలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ దానిని మన గ్రామాలలోకి రానీయొద్దని అన్నారు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను ఎవరు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ పార్టీ తరపున జాతీయ విధానంగా ఉండాలని రాష్ట్రానికో విధానాన్ని అమలు చేయడం తెలంగాణలో చేస్తానన్న ఆరు హామీలు కర్ణాటకలో ఎందుకు చేస్తలేరు నిలదీశారు కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి దురాలకోరు ప్రకటనలు చేస్తుందన్నారు.
తెలంగాణలో ఎక్కడ నాలుగు సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ గెలిచా అవకాశం లేదని కాంగ్రెస్ భాజపా పార్టీలకు ఓటు వేస్తే మురికి కాలువలు వేసేనట్టే కాగితం సమానమే అన్నారు.
ప్రతి గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళిక నాకున్నది ప్రతి గ్రామ స్వరూపము నాకు తెలుసు ఏ గ్రామానికి నాకు తెలుసు పరిపూర్ణ అవగాహన ఉన్నదని తప్పకుండా రేపు మీరు ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చిత్తూరు గ్రామంలో అందరితో కూర్చుని గ్రామానికి సంబంధించిన ప్రణాళికలు తయారుచేసి ఆ ప్రణాళిక బద్ధమైన పనులు చేస్తూ ముందు సాగుదాం అన్నారు.
44 లక్షల మందికి ఆసరా పెన్షన్, దివ్యాంగులకు 4000 పెన్షన్ ఒంటరి మహిళకు గౌడన్నలకు నేత నేతన్నలకు కెసిఆర్ పెన్షన్స్ అందిస్తున్నారని
కేసిఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి ఉద్దేశంతో రైతును రాజును చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, శాదీముబారక్, కెసిఆర్ కిట్టు, అమ్మఒడి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. అవినీతి, స్కాంలతో పేరుకుపోయిన కాంగ్రేస్ పార్టీ తరిమి కొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని నీతి నిజాయితీతో పని చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, యంపిపి సరిత – బాలరాజు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ నాయక్, మాజీ ఎంపిటిసి మాచర్ల ప్రవీణ్, చిలుకూరు గ్రామ శాఖ అధ్యక్షుడు గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల స్వామి, ముఖ్య నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.