జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త
కల్వకుర్తి/నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు ఫూలే 198వ జయంతి వేడుకలను.. బిసి సబ్ ప్లాన్ సాధన కమిటీ.. ఆధ్వర్యంలో ఘనంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని, పేద పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేశారన్నారు. నిరుపేద పిల్లల విద్యా దేశ భవిష్యత్తుకు పునాది అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, నాయకులు రాంభూపాల్ రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య కృష్ణ గౌడ్ , జిల్లా ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ జిల్లా సురేందర్ గౌడ కార్యవర్గ సభ్యులు నరేడ్ల శేఖర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు బాబీ దేవ్, రూరల్ మండల అధ్యక్షులు మట్ట నరేష్ గౌడ్, యువ మోర్చ జిల్లా కార్యదర్శి ధన్నోజు నరేష్ చారి, రాజశేఖర్ పాల్గొన్నారు.