సమానత్వం కోసం కృషి చేసిన విప్లవ జ్యోతి పూలే.

AYSstates

సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన విప్లవ జ్యోతి పూలే.

ఏ వై ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే
198 వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆ మహానీయుని చిత్ర పటానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ లు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే 11 ఏప్రిల్ 1827 న జన్మించాడని, మరియు షనవంబర్ 28, 1890 న మరణించారని* తెలిపారు . ఆయన బ్రతికినంత కాలం సామాజిక సమానత్వం కోసం పోరాడారని, బాల్యంలో అనుభవించిన దుర్బర జీవితం 19 వ శతాబ్దపు చీకటి రోజుల్లో బ్రాహ్మణీయ కులతత్వపు కోరల్లో చిక్కి శల్యమై పోతున్నా అణగారిన వర్గాలలో కుల నిర్మూలన దృక్పథాన్ని బోధించి అగ్రకులాల దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాల ప్రజలను సామాజిక విప్లవం దిశగా మేల్కొలిపిన తొలి సామాజిక విప్లవ చైతన్య స్ఫూర్తి మహాత్మా జ్యోతి రావు పూలే అని కొనియాడారు. మన భారత దేశంలో స్త్రీల విద్యాభివృద్ధికి* మొదటగా అంకురార్పణ చేసిన మహానీయుడు జ్యోతి రావు పూలేని తెలిపారు. మొట్టమొదటి సారి స్త్రీలకు పాఠశాలలను నెలకొల్పి తప బార్య అయిన సావిత్రి భాయి ఫూలే ను మొదటి ఉపాధ్యాయురాలిగా మార్చాడన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల బానీస బ్రతుకుల నుంచి విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త అన్నారు . కరుడుగట్టిన సామాజిక కట్టుబాట్లను తీవ్రంగా వ్యతిరేకించి వాటి నిర్మూలనకు జీవితమంతా పరితపించాడని చెప్పారు. మన భారత దేశానికి ఆ మహానీయుడు చేసిన సేవలు మరువలేనివని గ్రామ స్థాయి నుంచి నేటి యువత మహాత్మా జ్యోతి రావు పూలేను ఆదర్శంగా*తీసుకోవాలని అన్నారు ,ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి పుల్ల ప్రతాప్ నవాబ్ పేట మాజీ సర్పంచ్ రత్నాకర్ రెడ్డి అంబేద్కర్ వాది అంబాల అనిల్ అంబేద్కర్ యువజన సంఘం మండల కోశాధికారి కనకం తిరుపతి ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు నాయకులు గుర్రం తిరుపతి పాముకుంట్ల చందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!