బహుజన సంఘర్షణ సమితి అధ్వర్యం లో జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు…పాల్గొన్న నాయకులు అధికారులు…
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రం లో జరిగిన మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి సందర్బంగా మహాత్మా జ్యోతి రావు పూలె చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన బహుజన, సంఘర్షణ నాయకులు ఈ సందర్బంగా ఝరాసంగం ఎంపిడిఓ సుధాకర్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతల్ గట్టు శివరాజ్ మాట్లాడుతూ, స్వాతంత్రానికి పూర్వం వంద ఏబై ఏండ్ల క్రితమే జ్యోతి రావు పూలె బహుజనులకు సామాజిక న్యాయం కోసం స్త్రీ విద్య మరియు సమానత్వం కోసం అగ్రకులాల వారి తో పోరాటం చేసి బహుజన వర్గాల సామాజిక హక్కులు కాపాడిన మహనీయుడు జ్యోతి రావు పూలె అన్నారు. ఆయన ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బడ్జెట్ కేటాయింపులలో, సామాజిక న్యాయం కోసం బహుజనుల విద్య ఉపాధి అవకాశల కోసం బడ్జెట్ లో అధిక నిధులు కేటాయింపులు చేసి రాజ్యాంగ ఫలాలు, చట్ట బద్దంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చుడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమం లో ఎంపీడీఓ సుదాకర్, సమత సైకిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలరాజ్,మాజీ ఎంపీటీసీ సి. హెచ్ రాజ్‌కుమార్,అడ్వాకేట్ షకీల్, పెన్ గన్ ఎడిటర్ రాయికోటి నర్సింలు, బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులు చింతలగట్టు శివరాజ్, బహుజన నాయకులు జాగృతి అధ్యక్షులు ముదిరాజ్ పాండు, సి హెచ్ దత్తు, కొల్లూర్ గ్రామ అధ్యక్షులు డప్పుర్ సంగమేష్,బోజ్యానాయక్ తండా అధ్యక్షులు సుబాష్,సామాజికవేత్త దన్‌రాజ్ గౌడ్, 24 న్యూస్ మీడియా దిగంబర్,నాయకులు అమృత్, ప్రవీణ్,రవి విద్యాసాగర్,ఉపేందర్ మరియు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది మరియు వివిధ పార్టీ నాయకులు,వివిధ సంఘనాయకులు తధితరులు పాల్గోని మహాత్మ జ్యోతి రావు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.