జ్యోతక్క నువ్వు గెలవాలి బాపు చల్లంగా ఉండాలి

# నాగజ్యోతిని ధీవించిన కల్యాణలక్ష్మీ కుటుంబం

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన బడే నాగజ్యోతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా ములుగు మండలం భాగ్యతండాకు చేరుకున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న నాగజ్యోతి ‘కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌’ పథకానికి ఆధ్యులైన కీమానాయక్‌-రుక్కమ్మల ఇంటికి చేరుకున్నారు. నాగజ్యోతిని అక్కున చేర్చుకున్న కీమానాయక్‌ దంపతులు, పథకానికి కారకురాలైన కల్పన-యాకు దంపతులు నాగజ్యోతిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి ఇంటి ఆడబిడ్డ వలే ఆదరించారు. ఈ మేరకు నాగజ్యోతికి చీరె,సారెను అందించి నిండు మనస్సుతో దీవించారు. అనంతరం నాగజ్యోతి తన వెంట వచ్చిన నాయకులతో పాటు కీమానాయక్‌ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కీమానాయక్‌ మాట్లాడుతూ నాడు ఉద్యమ నాయకుడిగా 20ఏళ్ళ కింద సీఎం కేసీఆర్‌ వచ్చి తన కూతురు కల్పన పెండ్లీని సొంత ఖర్చులతో చేసి దీవించాడని అన్నారు. రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి హోదాలో తన మనవరాలు చంద్రకళ పెండ్లీ చేయించే బాధ్యతను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి అప్పగించి ఘనంగా జరిగేలా చేశాడని తెలిపారు. ఉద్యమ సమయంలో ఆడపిల్ల పెండ్లీ కష్టాన్ని తెలుసుకున్న కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కల్యాణలక్ష్మీ లాంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నాడని అన్నారు. ఇలాంటి గొప్ప పథకానికి తమ కుటుంబం కారణం కావడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద మా గ్రామంలో 70మందికి ఈ పథకం వర్తించిందని అన్నారు. కల్పన మాట్లాడుతూ తండ్రి తర్వాత తండ్రిగా తనకు పెండ్లీ చేసిన కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఏ ఆడ బిడ్డకు నా లాంటి కష్టం రావద్దని కల్యాణలక్ష్మీ పథకం కింద రూ.1లక్ష 116లను అందించడం గొప్పవిషయమని, ఆయన దేవునితో సమానమని కొనియాడారు. అనంతరం నాగజ్యోతి మాట్లాడుతూ కల్యాణలక్ష్మీ వంటి పథకం ములుగు జిల్లాలో పురుడు పోసుకోవడం గొప్ప విషయమని తెలిపారు. కీమానాయక్‌ ఆమె కుమార్తె కల్పన బాధను చూసిన కేసీఆర్‌ మానవతా దృక్పదంతో ఇచ్చిన మాట ప్రకారం పెండ్లీ చేసి ఆ సంఘటనను గుర్తు పెట్టుకొని తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఆడబిడ్డ పెండ్లీకి ఆటంకాలు రాకుండా కల్యాణలక్ష్మీ, షాదిముబారక్‌ పథకాన్ని పెట్టడం జరిగిందని అన్నారు. రెడ్కో చైర్మన్‌ వై. సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ భాగ్యతండా గ్రామంతో పాటు కల్యాణ లక్ష్మీ పథకానికి కారకులైన కీమానాయక్‌ అతని కుమార్తె కల్పనలు చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. కల్పన వంటి ఆడబిడ్డల దీవెనలు ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి ఢోకా లేదని, ప్రతీ ఎన్నికలో బీఆర్‌ఎస్ గెలుపు తధ్యమని అన్నారు. నవంబర్‌ 30వ తేదిన జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించి సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా దక్షణ భారత దేశంలో చరిత్ర స్నష్టించనున్నారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!