మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం కమలాపురం గ్రామం లో ఇద్దరు అమ్మాయిలు దంధ్యాల రాణి 15 రమ్య 14 సంవత్సరాలు వీరికి తల్లి తండ్రులు లేరు, వీరు రోజువారీ కూలి పనులుకి వెళ్లి జీవనం గడుపుతున్నారు వీరికి ఉండడానికి సొంత ఇళ్ళు కట్టుకోడానికి బట్టలు కూడా లేవు ఈ విషయం కమలాపురం గ్రామస్థులు మండలంలోని జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడంతో దాతల సహాకారంతో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వీరికి పడుకోడానికి మంచం,పరుపు,గిన్నెలు,బియ్యం, చద్దరులు సుమారుగా 10 వేళారూపాయల నిత్యావసర సరుకులు అందచేశారు అదే విదంగా మంగపేట ఎసై రవికుమార్ 5 వేల రూపాయలు సహాయం అందజేశారు విరికి సహాయం చేయడానికి ఇంక ఎవరైనా దాతలు ఉంటే ( A/C.086612010002064) చారిటబుల్ ట్రస్ట్ కు పంపించగలరు ఈ పిల్లలకు జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది అదే విదంగా వారిని చదివించడానికి ఎసై రవి కుమార్ జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చదివిస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం లో *జ్వాలా ట్రస్ట్ అధ్యక్షులు కోడెల నరేష్ ప్రధానకార్యదర్శి మునిగాల రాకేష్ వైస్ చైర్మన్ పుల్లంశెట్టి అజేయ్ కస్ప ముకుందాం కార్యదర్శి బండపెల్లి రవి గౌడ్ ఆత్మకూరు సతీష్ కోశాధికారి ముప్పారపు రాజు మీడియా ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ సోషల్ మీడియా ఇంచార్జి జై బీమ్ రాంమోహన్ నూతులకంటి రాకేష్ ముఖ్య గౌరవ సలహాదారులు కొలగట్ల నరేష్ రెడ్డి చాద మల్లయ్య ఎస్ డి బాబా తదితరులు పాలుగోన్నారు.