
వనపర్తి నేటిదాత్రి:
గతంలో అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని విస్మరించాయని,బిజెపి మోదీ నేతృత్వంలో ఆర్యవైశ్యులకు సముచిత స్థానం లభించి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు శ్రీ వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి పేర్కొన్నారు. బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ వనపర్తి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వ రి అమ్మవారి ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి సురేష్ శెట్టి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని ఆర్యవైశ్యుల మద్దతు భరత్ ప్రసాద్ కు ప్రకటించి ఓట్లు వేసి గెలిపించుకునేందుకు కృషి చేస్తామని సురేష్ శెట్టి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆకుతోట దేవరాజు దాచా లక్ష్మీనారాయణ గోనూరు యాదగిరి బాసెట్టి శ్రీనివాస్ బచ్చు రాము కొండా కిషోర్ మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి పిన్నం వసంత లోకనాథ్ రెడ్డి అయ్యంగారి ప్రభాకర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి ఆర్యవైశ్యులు పాల్గొన్నారు